Punjab Elections 2022: పంజాబ్ సీఎం చ‌న్నీకి 'షాక్'.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు న‌మోదు

Published : Feb 19, 2022, 01:11 PM IST
Punjab Elections 2022: పంజాబ్ సీఎం చ‌న్నీకి 'షాక్'.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు న‌మోదు

సారాంశం

 Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. శుక్ర‌వారంతో ఎన్నిక‌ల థ‌ర్డ్ ఫేజ్ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప్ర‌చారం ముగియనుంది. ఈ స‌మ‌యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించార‌ని పంజాబ్ సీఎం చన్నీ, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధూ మూసీవాలా ల‌పై కేసు నమోదైంది. 

Punjab Elections 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. పంజాబ్‌లో ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ప్ర‌ధాన పార్టీలు ప్రణాళిక‌లు సిద్దం చేశాయి. ఈ త‌రుణంలో రాజకీయ పార్టీల మధ్య .. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దింపేందుకు ఆప్ తో పాటు బీజేపీ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ ఏ పార్టీ కూడా వదులుకోవడం లేదు. 

ఇదిలా ఉంటే.. శుక్ర‌వారంతో ఎన్నిక‌ల థ‌ర్డ్ ఫేజ్ ఎన్నిక‌ల పోలింగ్‌కు ప్ర‌చారం ముగియనుంది. ఈ స‌మ‌యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ప‌లువురు నాయ‌కులపై ఫిర్యాదులందాయి.  ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పంజాబ్ సీఎం చన్నీ, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధూ మూసీవాలా ల‌పై కేసు నమోదైంది.   

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ పంజాబ్ సీఎం చన్నీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ పంజాబీ సింగర్ “సిద్ధూ మూసీవాలా” (శుభదీప్ సింగ్‌)లపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మాన్సా జిల్లాలో ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే.. ప్రచార స‌మ‌యం ముగిసిన ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా.. మాన్సా నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల సంఘం (ఈసీ) కి ఫిర్యాదు చేయడంతో సీఎం చన్నీ, మూసే వాలా ల‌పై ఐపీసీ సెక్షన్ 188, ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద‌ కేసు నమోదు చేయబడింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేవారిపై నిఘా వేయాలని దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు ఎన్నికల సంఘం ముందుగానే ఆదేశాలు జారీచేసింది.

అలాగే.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు SAD చీఫ్ సుఖ్‌బీర్ బాదల్‌పై చర్య తీసుకోవాలని ఆప్ కోరింది. శిరోమణి అకాలీదళ్ (SAD) చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్  ప్ర‌చార స‌మ‌యం దాటిన మార్గదర్శకాలను ఉల్లంఘించార‌ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. బాద‌ల్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలింగ్‌కు ఒక రోజు ముందు సోష‌ల్ మీడియా వేదికగా.. ప్ర‌చారం నిర్వ‌హించార‌ని  ఆప్ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations