Chhatrapati Shivaji: వీరత్వానికి ప్రతీక.. స్ఫూర్తి ప్ర‌దాత‌.. ఛ‌త్ర‌ప‌తి శివాజీకి ప్ర‌ధాని మోడీ నివాళులు !

Published : Feb 19, 2022, 12:24 PM IST
Chhatrapati Shivaji: వీరత్వానికి ప్రతీక.. స్ఫూర్తి ప్ర‌దాత‌.. ఛ‌త్ర‌ప‌తి శివాజీకి ప్ర‌ధాని మోడీ నివాళులు !

సారాంశం

Chhatrapati Shivaji Maharaj Jayanti: భారత వీరత్వానికి ప్రతీక.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా సామ్రాజ్యపు యోధుడైన ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి  వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ.. ఛ‌త్ర‌ప‌తి శివాజీకి నివాళులు అర్పించారు. త‌ర‌త‌రాల‌కు శివాజీ మ‌హారాజ్ స్ఫూర్తిని ఇస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ (PM Modi) అన్నారు. 

Chhatrapati Shivaji Maharaj Jayanti: భారత వీరత్వానికి ప్రతీక.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా సామ్రాజ్యపు యోధుడైన ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి  వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ.. ఛ‌త్ర‌ప‌తి శివాజీకి నివాళులు అర్పించారు. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని, ప‌రాక్రమాన్ని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం (ఫిబ్రవరి 19) మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji)  జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. శివాజీ విశిష్ట నాయకత్వం, సాంఘిక సంక్షేమానికి ప్రాధాన్యత తరతరాలుగా ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. శివాజీ ఆశయాన్ని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని PM Modi తెలిపారు. 

''ఛత్రపతి శివాజీ మహరాజ్‌ (Chhatrapati Shivaji) జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నాను. అతని అత్యుత్తమ నాయకత్వం & సాంఘిక సంక్షేమానికి ప్రాధాన్యత తరతరాలుగా ప్రజలకు స్ఫూర్తినిస్తోంది. సత్యం & న్యాయం విలువల కోసం నిలబడే విషయంలో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ రాజీపడలేదు. ఆయన దార్శనికతను నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం' అని ప్రధాని న‌రేంద్ర మోడీ (PM Modi) ట్వీట్‌లో పేర్కొన్నారు.


అలాగే, ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు సైతం ఛ‌త్ర‌ప‌తి శివాజీ సేవ‌ల‌ను కొనియాడుతూ.. ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ''మరాఠా యోధుడు, హిందూ హృదయసామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మాతృభూమి సంరక్షణకు ప్రజల్లో దేశభక్తి భావనను జాగృతం చేయడంతోపాటు, గెరిల్లా యుద్ధతంత్రంతో తానే ముందుండి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన తీరు అద్భుతం'' అని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెంక‌య్య నాయుడు స్పందించారు. 


అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో పాటు పలువురు ప్ర‌ముఖులు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) మహారాజ్ జయంతి సందర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. 

 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌