భారత్ కి అభినందన్.. పాక్ గుఢాచారి అరెస్ట్

Published : Mar 01, 2019, 10:47 AM IST
భారత్ కి అభినందన్.. పాక్ గుఢాచారి అరెస్ట్

సారాంశం

పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ మరికాసేపట్లో భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు.

పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ మరికాసేపట్లో భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. అభినందన్ ని విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయన రాకకోసం దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ మరో దుర్మార్గం బట్టబయలైంది. ఫిరోజ్‌పూర్‌లో సంచరిస్తున్న పాక్‌ గుఢాచారిని భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ క్యాంపుల్లో రెక్కీ నిర్వహిస్తున్న ఆ వ్యక్తి.. భారత బలగాలకు సంబంధించిన ఫొటోలు తీస్తున్నాడు. అతని వద్ద నుంచి పాక్‌ సిమ్‌ కార్ట్‌తో ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు