రేపే నిర్భయ దోషులకు ఉరి: కోర్టు బయట సొమ్మసిల్లి పడిపోయిన అక్షయ్ భార్య

By Siva KodatiFirst Published Mar 19, 2020, 4:50 PM IST
Highlights

కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ భార్య పునీతా దేవీ కోర్టు బయట స్పృహతప్పి కిందపడిపోయింది. తన భర్తకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఆమె బిగ్గరగా ఆరుస్తూ, విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 

తమ ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్లను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలులో పవన్ గుప్తా, ముఖేశ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ‌లకు ఉరిశిక్ష అమలు కానుంది.

Also Read:కొత్త డ్రామా: విడాకులు కోరిన నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ భార్య

అయితే కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ భార్య పునీతా దేవీ కోర్టు బయట స్పృహతప్పి కిందపడిపోయింది. తన భర్తకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ ఆమె బిగ్గరగా ఆరుస్తూ, విలపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదులు, కుటుంబసభ్యులు ఆమెకు సపర్యలు చేశారు.

కాగా నిన్న పునీతా దేవి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్తను అత్యాచారం కేసులో దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారని, కానీ అతను నిర్దోషి అని, తాను విధవను కాదలుచుకోలేదని ఆమె తన పిటిషన్ లో చెప్పింది. 

Also Read:ఖేల్ ఖతం: నిర్భయ దోషులకు రేపే ఉరి, లాయర్ ఏపీ సింగ్ చివరి రోజు డ్రామాలు ఇవే....

హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉందని, ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉందని అక్షయ్ ఠాకూర్ భార్య తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ చెప్పారు. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. 

 

click me!