అత్యాచార యత్నం: మహిళ కళ్లలో ఆయుధంతో పొడిచి.....

Published : Nov 07, 2020, 07:54 AM IST
అత్యాచార యత్నం: మహిళ కళ్లలో ఆయుధంతో పొడిచి.....

సారాంశం

మహారాష్ట్రలోని పూణేలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను దుండగుడు నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ప్రతిఘటన ఎదురు కావడంతో ఆమె కళ్లలో పొడిచాడు.

పూణే: మహారాష్ట్రలోని పూణేలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిన ఓ మహిళను దుండగుడు చిత్రహింసలకు గురి చేశాడు. తనకు సహకరించలేదనే కోపంతో మహిళ కంట్లోకి ఆయుధాన్ని దించాడు.

పూణేలోని తహసీల్ అనే గ్రామంలో బుధవారం 37 ఏళ్ల వయస్సు గల మహిళ రాత్రి సమయంలో బహిరంగ మలవిసర్జనకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి పట్టుకుని వేరే చోటికి లాక్కెళ్లాడు. 

ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దాన్ని మహిళ బలంగా ప్రతిఘటించింది. దాంతో ఆవేశం పట్టలేక దుండగుడు ఆమె కంట్లో బలమైన ఆయుధంతో పొడిచాడు. నొప్పితో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విని స్థానికులు ఆమెను రక్షించడానికి వచ్చారు. 

వారిని చూసి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వారు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం