ఘోర ప్రమాదం.. ట్రాక్టర్‌ టైర్లకింద నలిగిపోయిన ఆరు నెలల చిన్నారి..

By Mahesh RajamoniFirst Published Sep 23, 2022, 3:34 PM IST
Highlights

Accident: పూణే-నాసిక్‌ హైవేపై రాజ్‌గురునగర్‌ వద్ద  వేగంగా వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ ను ఓవర్‌ టేక్‌ చేయబోయి ఒక బైక్‌  జారిపడిపోయింది. బైక్ పై వున్న వారు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆరు  నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
 

Pune-Nashik highway Accident: మహారాష్ట్రలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణే-నాసిక్‌ హైవేపై రాజ్‌గురునగర్‌ వద్ద  వేగంగా వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ ను ఓవర్‌ టేక్‌ చేయబోయి ఒక బైక్‌  జారిపడిపోయింది. బైక్ పై వున్న వారు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆరు  నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని రాజ్‌గురునగర్ ప్రాంతంలో పూణె-నాసిక్ హైవేపై శుక్రవారం వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో పసికందును తీసుకెళ్తున్న బైక్ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపైకి దూసుకెళ్లింది. బైకర్ నియంత్రణ కోల్పోవడంతో  బైక్‌ రోడ్డుపై పడింది. ఈ క్రమంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు ఒక మహిళ, మరో చిన్నారి కిందపడ్డారు. అయితే, వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆ చిన్నారి పై నుంచి వెళ్లింది. దీంతో ట్రాక్టర్ టైర్ల కిందపడ్డ ఆరు నెలల చిన్నారి నలిగిపోయి..  అక్కడికక్కడే మృతి చెందింది. 

पुणे जिल्ह्यातील राजगुरुनगर मध्ये सहा महिन्याच्या चिमुकलीचा ट्रॅक्टरच्या चाकाखाली येवून मृत्यू झाला आहे.दुचाकीवर आईच्या कुशीत बसुन निघालेल्या सहा महिन्यांच्या कोवळ्या मुलीचा मृत्युची घटना सीसीटीव्हीमध्ये चित्रित झाली आहे. pic.twitter.com/YXUCwtUGrF

— Mumbai Tak (@mumbaitak)

ప్రమాదం జరగడానికి ముందు చిన్నారి మహిళ ఒడిలో ఉన్నట్లు ఘటనాస్థలికి చెందిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అసంఘటిత పార్కింగ్, రద్దీగా ఉండే రోడ్డు కారణంగా బైక్ స్కిడ్ అయిందని ప్రమాదంపై ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే, తమ కళ్ల ముందే చూస్తుండగానే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లి ఆవేదనకు అంతులేకుండా పోయింది. అక్కడున్న వారిని సైతం ఈ ఘటన కన్నీరు పెట్టించిందని తెలిపారు. 

click me!