ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం.. పాద‌ర‌క్ష‌ల త‌యారీ క‌ర్మాగారంలో చెల‌రేగిన మంట‌లు

Published : Sep 23, 2022, 03:06 PM IST
ఢిల్లీలో ఘోర అగ్నిప్ర‌మాదం..  పాద‌ర‌క్ష‌ల త‌యారీ క‌ర్మాగారంలో చెల‌రేగిన మంట‌లు

సారాంశం

ఢిల్లీలో ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు. 

ఉత్తర ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ షూ త‌యారీ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్ట‌మూ జ‌ర‌గ‌లేదని అధికారులు తెలిపారు. ఉత్తర ఢిల్లీలోని ఎంఎస్‌సీ మాల్‌కు సమీపంలో ఉన్న నరేలా ఇండస్ట్రియల్ ఏరియా సి 358లోని ఫ్యాక్టరీలో ఉదయం 8.37 గంటలకు అగ్ని ప్రమాదం జ‌రిగిన‌ట్టు తమకు సమాచారం అందిందని అగ్నిమాప‌క శాఖ అధికారి తెలిపారు.

కాలానికి అనుగుణంగా రెడ్ క్రాస్ సొసైటీ మారాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌

ఆ తర్వాత వెంటనే ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయ‌ని అన్నారు. ఈ ఘటనలో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా.. ప్ర‌స్తుతం మంట‌ల‌ను ఆర్పే ప‌నులు కొన‌సాగుతున్నాయి.

Rainfall: ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వానలు.. మూతపడ్డ స్కూళ్లు, కార్యాలయాలు

కాగా. కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని నరేలాలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ గ్రాన్యూల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.. మంటలు చాలా తీవ్రంగా ఉండడంతో అగ్నిమాపక దళానికి చెందిన 27 వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. కానీ ఈ ప్ర‌మాదం వ‌ల్ల ఆ ప్రాంతమంతా అలజడి, గందరగోళం నెలకొంది.

 

పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలోని ఓ పెళ్లి పందాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఇటీవ‌ల క‌ల‌క‌లం రేపింది. అనంతరం 23 ఫైరింజన్లను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనంత‌రం మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్ర‌మాదంలో ఓ కారు కాలిపోయింది. 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu