ప్రతీకారం తీర్చుకున్న భారత్: పుల్వామా దాడి సూత్రధారి హతం

By Siva KodatiFirst Published Feb 18, 2019, 11:50 AM IST
Highlights

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 43 మంది జవాన్ల మరణానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడికి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టింది. 

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 43 మంది జవాన్ల మరణానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా దాడికి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ అబ్డుల్ రషీద్ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టింది.

పుల్వామా దాడికి తెగబడిని ఉగ్రవాదుల కోసం సైన్యం విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ వద్ద భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు.

సైన్యంపై కాల్పులు జరుపుతూ భవనంలో దాక్కొన్న ముష్కరులను సైన్యం తీవ్రంగా శ్రమించి హతమార్చింది. అయితే ఉగ్రవాదులతో జరిగిన పోరులతో ఆర్మీ మేజర్ సహా ముగ్గురు జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.

32 ఏళ్ల అబ్ధుల్ రషీద్ ఘాజీ జైషే అధినేత మసూద్ అజహర్‌కు అత్యంత నమ్మకస్తుడు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ గ్రూపులో శిక్షణ పొందాడు. ఆఫ్గన్ యుద్ధంలో పాల్గొన్న ఇతను ఐఈడీలు తయారు చేయడం, అమర్చడం, వాటిని పేల్చడంలో ఎక్స్‌పర్ట్.

అయితే మసూద్ మేనల్లుళ్లు తాలా రషీద్, ఉస్మాన్‌లు భారత సైన్యం మట్టుబెట్టడంతో రగిలిపోయిన అజహర్... వారి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు గాను ఘాజీని రంగంలోకి దింపాడు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌లోని యువతను రెచ్చగొట్టి వారిని భారత్‌పైకి ఊసిగొల్పడంలో ఘాజీ కీలక పాత్ర పోషించాడు. తాజాగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహం పన్ని అదిల్ అహ్మద్ దార్‌ని సూసైడ్ బాంబర్‌గా మార్చాడు. కొద్దిరోజుల క్రితం రతన్‌పోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తృటిలో తప్పించుకున్న రషీద్... ఎట్టకేలకు భారత సైన్యం చేతిలో హతమయ్యాడు. 

click me!