దేశ భద్రతతో పాటు మానవత్వం...మావోయిస్టుకు రక్తదానం చేసిన సైనికులు

By Siva KodatiFirst Published Feb 18, 2019, 9:07 AM IST
Highlights

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మావోయిస్టుకి రక్తదానం చేసి మానవత్వం చూపాడు సీఆర్‌పీఎఫ్ జవాను. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ పశ్చిమ సింగ్‌భమ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 24 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు,సీఆర్‌పీఎఫ్ బలగాలకు సమాచారం అందింది.

దీంతో ముఫ్పస్సిల్-గోయిల్కెరా ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మావోల శిబిరాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు లొంగిపోవాల్సిందిగా కోరాయి. అయితే మందుపాతరను పేల్చిన మావోయిస్టులు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు ప్రయత్నించారు.

దీంతో బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రక్తం ఎక్కించాల్సి వచ్చింది.

ఆమె ప్రాణాలను కాపాడేందుకు ఏఎస్సై పంకజ్‌వర్మ, హెడ్ కానిస్టేబుల్ బిచిత్ర కుమార్, కానిస్టేబుల్ బిర్ బహదూర్ యాదవ్ రక్తదానం చేశారు. దేశ రక్షణతో పాటు మానవత్వం చూపిన జవాన్లపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 

click me!