పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: నలుగురు జవాన్లు మృతి

Siva Kodati |  
Published : Feb 18, 2019, 08:35 AM ISTUpdated : Feb 18, 2019, 09:04 AM IST
పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: నలుగురు జవాన్లు మృతి

సారాంశం

40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను కోల్పోయిన సంఘటనను మరచిపోక ముందే పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సైనికులపై కాల్పులకు దిగడంతో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను కోల్పోయిన సంఘటనను మరచిపోక ముందే పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సైనికులపై కాల్పులకు దిగడంతో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

పుల్వామా ఘటనతో సైన్యం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పింగ్లాన్ ప్రాంతంలో సైన్యానికి కొందరు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఒక ఇంట్లోకి చొరబడిన ముష్కరులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిని పుల్వామా ఉగ్రదాడికి పాల్పడ్డ జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?