
హైదరాబాద్: వారిసు చిత్రంలోని రంజితమే పాట సోషల్ మీడియాలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రీల్స్‌లో చాలా మంది తమ తమ స్టెప్పులు వేస్తూ కనిపిస్తారు. రంజితమే పాట సోషల్ మీడియాలో అంత ఫేమస్ అయిపోయింది. ఈ పాటకు సాధారణ యూజర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు డ్యాన్స్ స్టెప్పులు వేశారంటే అందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు. కానీ, ఏకంగా ఓ జిల్లా కలెక్టర్ స్టెప్పులు వేయడమే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలను ఉద్దేశించే ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించారు. అదే రోజున తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలోనూ పలు కార్యక్రమాలు జరిగాయి. అందులో జిల్లా కలెక్టర్ నిర్వహించిన కార్యక్రమం కూడా ఉన్నది. కానీ, ఈ కలెక్టర్ కార్యక్రమం సోషల్ మీడియాలో హిట్ అయింది. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. కలెక్టర్ స్వయంగా స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు.
Also Read: తెలంగాణ, ఏపీ వాసులకు చల్లని కబురు.. ఈ నెల 15 నుంచి వర్షాలు
ఆ కార్యక్రమంలో ఆమె అందరిలో హుషారు నింపుతూ ఇతర మహిళా ఆఫీసర్లతోనూ డ్యాన్స్ చేయించారు. ఈ డ్యాన్స్ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. కలెక్టర్ మేడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.