‘కిడ్నీ, లివర్ ఫర్ సేల్’.. ఇంటి బయట పోస్టర్.. ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే షాకింగ్ నిజాలు..!

Published : Mar 12, 2023, 04:56 PM ISTUpdated : Mar 12, 2023, 05:17 PM IST
‘కిడ్నీ, లివర్ ఫర్ సేల్’.. ఇంటి బయట పోస్టర్.. ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే షాకింగ్ నిజాలు..!

సారాంశం

కేరళలో ఓ ఇంటి ముందు పెట్టిన బోర్డు కలకలం రేపుతున్నది. కిడ్నీ, లివర్ ఫర్ సేల్ అని రెండు ఫోన్ నెంబర్లతో బోర్డు ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వంపై విమర్శగా ఊరికే ఏర్పాటు చేశారని భావించారు. కానీ, ఫోన్ చేస్తే అది నిజంగానే అవయవాలు అమ్మడానికే ఏర్పాటు చేశారని తెలియవచ్చింది.  

తిరువనంతపురం: కేరళలో ఓ షాకింగ్ పోస్టర్ కనిపించింది. ఓ ఇంటి ఎదురుగా కిడ్నీ, లివర్ ఫర్ సేల్ అనే బోర్డు కలకలం రేపింది. ఆ బోర్డు ఒక ప్రాంక్ కావొచ్చేమో అని చాలా మంది అనుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో భాగంగా ఈ బోర్డు ఏర్పాటు చేశారేమో అని భావించారు. ఇంకొందరు అనుమానాలతో ఆ బోర్డుపై ఉన్న ఫోన్ నెంబర్లకు కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్స్‌ ద్వారా సంచలన విషయాలు వెల్లడిలోకి వచ్చాయి. ఆ బోర్డులో విమర్శ ఏమీ లేదని, అది వాస్తవంగా కిడ్నీ, లివర్ అమ్మడానికే బోర్డు పెట్టారని స్పష్టమైంది.

ఆ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డుపై రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఆ నెంబర్లకు డయల్ చేస్తే నిజంగానే వారు కిడ్నీ, లివర్ అమ్మాలనే అనుకుంటున్నట్టు తెలిసింది. తిరువనంతపురంలో మనకాడ్‌లో సంతోష్ కుమార్ (50) అనే వ్యక్తి ఈ బోర్డు పెట్టాడు.

ఆ నెంబర్లకు కాల్ చేస్తే సంతోష్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. తాను ఓ ఫ్రూట్ షాప్‌లో పని చేసేవాడని, అక్కడ సంచులు ఎత్తుతుండగా ప్రమాదానికి గురయ్యాడని వివరించాడు. అప్పుడు తాను ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాడని తెలిపాడు. ఇప్పుడు తన వద్ద చిల్లిగవ్వ లేదని అన్నాడు. మనకాడ్ జంక్షన్‌లో వారి కుటుంబ ఆస్తి భూమి ఉన్నదని గుర్తు చేశాడు. అయితే, తన సోదరుడితో ఈ భూమి విషయమై గొడవ ఉన్నదని తెలిపాడు. కాబట్టి, ఆ భూమి అమ్మడం కుదరడం లేదని వివరించాడు.

Also Read: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్స్..

తన సోదరుడు మీడియాతో మాట్లాడుతూ ఆ ఆస్తి తన తల్లి పేరిట ఉండేదని, ఇప్పుడు సంతోష సహా తమ ఆరుగురు అన్నాదమ్ముల పేరిట ఉన్నదని తెలిపాడు.

సంతోష్ మాట్లాడుతూ తన భార్య పిల్లలకు ట్యూషన్ చెప్పిందని, కానీ, కొవిడ్ 19 తర్వాత ఆ ట్యూషన్లు కూడా ఆగిపోయాయని వివరించాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని సాకడం దుర్భరంగా మారిందని అన్నాడు. అందుకే తమ ముఖ్యమైన అవయవాలను అమ్మడం మినహా మరే దారి లేదని వివరించాడు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu