:కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.బుధవారం నాడు ఆయన వీడియో కాన్పరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.
న్యూఢిల్లీ:కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాను అనుమతిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.బుధవారం నాడు ఆయన వీడియో కాన్పరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు.
నిర్ధిష్ట మార్గదర్శకాల ద్వారా ప్రజా రవాణాను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. బస్సులు, కార్లు నడిపేవారంతా తమ చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. ఫేస్ మాస్కులు దరించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ప్రజా రవాణాను ఎప్పటి నుండి అనుమతిస్తారనేది ఇంకా మంత్రి వెల్లడించలేదు. బస్సు, కారు ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో మంత్రి గడ్కరీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
ALSO READ:లాక్‌డౌన్ దెబ్బ: రోజూ రూ. 1.5 కోట్ల ఆదాయం కోల్పోయిన షిరిడి టెంపుల్
గ్రీన్, ఆరెంజ్ జోన్లపై కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలపై సడలింపులు ఇచ్చింది. రెడ్ జోన్ లో మాత్రమే ఆంక్షలను మినహాయించలేదు.దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి ప్రజా రవాణాను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
మెట్రో రైళ్లతో పాటు, ప్రైవేట్ వాహనాలను కూడ అనుమతి ఇవ్వలేదు. విమానాలను కూడ నిలిపివేసింది ప్రభుత్వం.ఢిల్లీలో 33 శాతం మందితో కార్యాలయాలు పనిచేసేలా ఆ రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది.