కరోనా విధుల్లో తండ్రి, మూడేళ్ల కొడుకు మృతి: అంత్యక్రియల్లో దూరంగానే...

By narsimha lode  |  First Published May 6, 2020, 5:15 PM IST

అనారోగ్యంతో మూడేళ్ల కొడుకు చనిపోతే కరోనా రోగుల సేవలో ఉన్న అతడి తండ్రి దూరంగా నిలబడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బతికున్న సమయంలో కొడుకును చూసుకోలేదు.


లక్నో:అనారోగ్యంతో మూడేళ్ల కొడుకు చనిపోతే కరోనా రోగుల సేవలో ఉన్న అతడి తండ్రి దూరంగా నిలబడి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బతికున్న సమయంలో కొడుకును చూసుకోలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కొడుకు ఫోటోలు, వీడియోలను ఫోన్లో చూసి సంతృప్తి చెందాడు. కొడుకును కనీసం ముట్టుకోలేకపోయాయని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన 27 ఏళ్ల మనీష్ కుమార్ లోక్‌బంధు ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఐసోలేషన్  వార్డులో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. శనివారం నాడు రాత్రి ఆయనకు ఇంటి నుండి ఫోన్ వచ్చింది. మనీష్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. అతని పేరు హర్షిత్. 

Latest Videos

శనివారం నాడు రాత్రి మనీష్ కుమార్ కు ఇంటి నుండి ఫోన్ వచ్చింది. కడుపునొప్పితో కొడుకు ఇబ్బందిపడుతున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. అతడిని  ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టుగా చెప్పారు. కరోనా వార్డులో ఉన్నందున తాను ఆసుపత్రికి వెళ్లలేకపోయాడు. కొడుకుకు ఆసుపత్రిలో చికిత్సకు సంబంధించిన ఫోటోలను ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికప్పుడు అతనికి వాట్సాప్ లో షేర్ చేశారు.

also read:లాక్‌డౌన్ దెబ్బ: రోజూ రూ. 1.5 కోట్ల ఆదాయం కోల్పోయిన షిరిడి టెంపుల్

ఆదివారం నాడు తెల్లవారుజామున హర్షిత్ మరణించాడని కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. పదే పదే ఇంటి నుండి ఫోన్లు రావడంతో అతని సహచరులకు విషయం అర్ధమైంది. వెంటనే అతడిని ఇంటికి పంపారు. కొడుకు చికిత్స పొందిన ఆసుపత్రిలో దూరంగా నిలబడి కొడుకును చూశాడు. కొడుకును తీసుకెళ్లే వాహనం వెనుకే తన బైక్ పై ఇంటికి చేరుకొన్నాడు. 

చివరగా తన కొడుకును తాకలేదన్నారు. అంత్యక్రియల్లో కూడ తాను దూరంగానే ఉన్నానని ఆయన మీడియాకు చెప్పారు. తనతో తన కొడుకు గడిపిన రోజులను గుర్తు చేసుకొంటూ గడిపాడు తన కారణంగా తన కుటుంబసభ్యులకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశ్యంతో జాగ్రత్తలు తీసుకొన్నానని ఆయన చెప్పారు.


 

click me!