రెజ్లర్లతో పీటీ ఉష భేటీ.. ‘క్రమశిక్షణా రాహిత్యం’ వ్యాఖ్యలు చేసిన ఆరు రోజుల తరువాత పరిణామం..

By Asianet News  |  First Published May 3, 2023, 3:03 PM IST

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ బుధవారం కలిశారు. నిరసనకారులతో మాట్లాడారు.


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం సమావేశమయ్యారు. గత 11 రోజులుగా అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన తెలుపుతున్న దేశ రాజధానిలోని జంతర్ మంతర్ కు మాజీ అథ్లెట్ చేరుకున్నారు. రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియాలతో ఆమె మాట్లాడారు.

క్రికెటర్ మహ్మద్ షమీకి వేశ్యలతో వివాహేతర సంబంధాలు - భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు

Latest Videos

ఆమె ‘ప్రతిష్టను దిగజార్చే’వ్యాఖ్యలు చేసిన ఆరు రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వీధుల్లోకి వచ్చే ముందు రెజర్లు భారత ఒలింపిక్ సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉండాల్సిందని పీటీ ఉష ఏప్రిల్ 27వ తేదీన అన్నారు. తమ  సంఘంలో లైంగిక వేధింపులపై ఒక కమిటీ ఉందని చెప్పారు. నిరసన తెలిపే రెజర్లు ముందు వీధుల్లోకి వెళ్లే ముందు తమ వద్దకు వస్తే బాగుండేదని అన్నారు. కానీ వారు అలా చేయలేదని అన్నారు. ‘‘ఆటగాళ్ళు వీధుల్లో నిరసనలు చేయకూడదు. కనీసం కమిటీ నివేదిక కోసం ఎదురుచూడాలి. వారు చేసిన పని ఆటకు, దేశానికి మంచిది కాదు. ఇది ప్రతికూల విధానం. నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి సమానం’’ అని ఆమె పిటీ ఉష వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆమె మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని, కానీ ఆమె చేసిన వ్యాఖ్యలతో తాము బాధపడ్డామని చెప్పారు. ‘‘పీటీ ఉష వ్యాఖ్యతో బాధపడ్డాం. ఆమె స్వయంగా మహిళ అయినప్పటికీ ఆమె మాకు మద్దతు ఇవ్వడం లేదు. ఏం క్రమశిక్షణారాహిత్యం చేశాం. మేం శాంతియుతంగా ఇక్కడ కూర్చున్నాం. మాకు న్యాయం జరిగి ఉంటే ఇలా చేసి ఉండేవాళ్లం కాదు’’ అని రెజ్లర్ సాక్షి మాలిక్‌ అన్నారు.

ఘోరం.. పెళ్లి చేసుకుంటానని హమీ ఇచ్చి.. యువతిపై పోలీసు, అతడి సోదరుడి సామూహిక అత్యాచారం..

ఉష వ్యాఖ్యలను కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత వినేశ్ ఫోగట్ కూడా ఖండించారు. తాము రాజ్యాంగం ప్రకారమే జీవిస్తున్నామని, స్వతంత్ర పౌరులమని చెప్పారు. ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. తాము వీధుల్లో కూర్చుంటే ఐఓఏ అయినా, క్రీడా మంత్రిత్వ శాఖ అయినా మా మాట వినకపోవడానికి ఏదో ఒక కారణం ఉండాలని అన్నారు. ‘‘పీటీ ఉష ఇలా అనడం అమానుషం. నేను ఆమెకు ఫోన్ చేశాను, కానీ ఆమె నా ఫోన్ ఎత్తలేదు’’ అని వినేష్ చెప్పాడు.

ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ.. ‘‘ ఐఓఏ చీఫ్ ఒక మహిళ. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేము బాధపడ్డాం. ఐఓఏను ఆశ్రయించాల్సిందని ఆమె కోరారు. కానీ మేము మూడు నెలల క్రితమే అక్కడికి వెళ్లాం. అయినా మాకు న్యాయం జరగలేదు.’’ అని తెలిపారు. 

బకింగ్ హామ్ ప్యాలెస్ లోకి తూటాలు విసిరిన వ్యక్తి.. కింగ్ చార్లెస్ - III పట్టాభిషేకానికి ముందు ఘటన..

కాగా.. మొదటి సారిగా మూడు నెలల కిందట ప్రముఖ రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. దీంతో డబ్ల్యూఎఫ్ఐ, దాని చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఇతర కోచ్ లపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ‘పర్యవేక్షణ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అంశంపై తమకు నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది. అయితే మళ్లీ ఏప్రిల్ లో రెజ్లర్లు నిరసన ప్రారంభించారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఏప్రిల్ 30న ఢిల్లీ పోలీసులు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సింగ్ పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. భారత అగ్రశ్రేణి రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాతో పాటు పలువురు రెజ్లర్లు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. 

click me!