ఘోరం.. పెళ్లి చేసుకుంటానని హమీ ఇచ్చి.. యువతిపై పోలీసు, అతడి సోదరుడి సామూహిక అత్యాచారం..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి పోలీసు కానిస్టేబుల్ ఓ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మళ్లీ ఆమెను తన సోదరుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై కానిస్టేబుల్, అతడి సోదరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి నిందితులపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు.
దారుణం.. ఐదుగురు చిన్నారులను బెదిరించి గ్యాంగ్ రేప్.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి..
పోలీసులు తెలిపిన వివరాలు, అలాగే బాధితురాలు సహరాన్ పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కు రాసిన లేఖ ప్రకారం.. కానిస్టేబుల్ కు, సహరాన్ పూర్ జిల్లాకు చెందిన బాధిత మహిళకు కొంత కాలం కిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో కానిస్టేబుల్ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అనంతరం నిందితుడు ఆమెను వేర్వేరు హోటళ్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బకింగ్ హామ్ ప్యాలెస్ లోకి తూటాలు విసిరిన వ్యక్తి.. కింగ్ చార్లెస్ - III పట్టాభిషేకానికి ముందు ఘటన..
దీంతో బాధితురాలు రెండు సార్లు గర్భం దాల్చింది. అయితే ఈ విషయంలో ఆరు నెలల క్రితం నిందితుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 25వ తేదీన ఆ కానిస్టేబుల్ తాను బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పోలీసులకు అఫిడవిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను షామ్లీలోని తన అన్న ఇంట్లోని తీసుకెళ్లాడు.
ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ఏపీ వాసి ప్రతిభ.. బ్రాంజ్ మెడల్ సాధించిన పెంటేల హరికృష్ణ
అక్కడ నిందితుడు, అతడి సోదరుడు ఇద్దరూ ఆమెను తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాలన్నీ ఆమె ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా గతేడాది ఇలాంటి దారుణానికే ఒడిగట్టాడు. 2022 అక్టోబర్ నెలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తన చెల్లెలు భర్త ద్వారా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేసే విజయ్ కుమార్ (33)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఆమెను అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదే పదే అత్యాచారం చేశాడు. కానీ చివరికి ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోబోనని చెప్పాడు. ఆమె ఫోన్ నెంబర్ ను కూడా బ్లాక్ చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.