గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ .. సుప్రీంకోర్టులో కేంద్రం హామీ.. 

Published : May 03, 2023, 02:16 PM IST
గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ .. సుప్రీంకోర్టులో కేంద్రం హామీ.. 

సారాంశం

స్వలింగ వివాహాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత కొన్నిరోజులుగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లపై విచారిస్తోంది.ఈ క్రమంలోనే కేంద్రం తన వాదన వినిపిస్తూ ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 

స్వలింగ వివాహల చట్టబద్దత చర్చనీయంగా మారింది.  ఇప్పటికే వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అలాగే.. సేమ్ సెక్స్ మ్యారేజ్ విషయంలో  కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహం చేసుకున్న వారు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో గుర్తింపు లేని స్వలింగ సంపర్కుల సమస్యలను పరిగణలోకి తీసుకునేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసేందుకు సిద్ధమైంది. స్వలింగ సంపర్కుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎస్‌జి తుషార్ మెహతా అన్నారు. క్యాబినెట్ సెక్రటరీ స్థాయి అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. స్వలింగ సంపర్కుల సమస్యల పరిష్కార మార్గాల ఆ కమిటి వివరించవచ్చని పేర్కోన్నారు.
 
ఈ సందర్భంగా పలు కీలక విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ప్రధానంగా సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించింది. గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్స్ , వారసత్వం , సంతానానికి సంబంధించిన విషయాలపై వారసులను నామినేట్ చేయడంలో స్వలింగ జంటలు ఎదుర్కొంటున్న సమస్యలను కోర్టు ప్రస్తావించింది. అయితే.. ప్రాక్టికల్‌గా ఇవన్నీ సాధ్యమవుతాయా? లేదా ? అనే అంశంపైనా ఈ కమిటీ దృష్టి సారించనుందనీ, ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఓ ప్రత్యేక  కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.  

సేమ్ సెక్స్ మ్యారేజ్ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసును సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ , జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే సేమ్ సెక్స్ వివాహల్లో చట్టబద్ధత కల్పించకుండా వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ఏప్రిల్ 27న విచారణలో ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
 
యువత కోరిక కాదు, రాజ్యాంగ సంకల్పం: సీజేఐ

  స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లోని యువత స్వలింగ సంపర్కుల వివాహాలను సుప్రీంకోర్టు గుర్తించాలని కోరుతున్నారని మేనకా గురుస్వామి అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును డిమాండ్ చేశారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లోని యువకులు స్వలింగ వివాహాలను సుప్రీంకోర్టు గుర్తించాలని కోరుతున్నారని మేనకా గురుస్వామి అన్నారు. వారు కోర్టు నుంచి ఏం కోరుకుంటున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీజేఐ అన్నారు. రాజ్యాంగ సంకల్పం ఏమిటో మేము పరిగణించి నిర్ణయం ఇవ్వాలనీ, కాబట్టి మీ వాదనలలో సమస్య ఉందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu