
మనుషులు మద్యం తాగడం చాలా కామన్. కానీ... కోతులు కూడా మందు తాగడం ఎక్కడైనా చూశారా..? ఓ కోతి బీర్ బాటిల్ పట్టుకొని.. చుక్క వదలకుండా తాగేసింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
కోతులు ఊళ్లల్లో ఇళ్లల్లోకి వచ్చి తినే వస్తువులు ఎత్తుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే... ఈ కింద వీడియోలో కోతి చేసిన పని చూసి అందరూ షాకయ్యారు. వైన్ షాప్ కి వెళ్లి.. బీర్ టిన్ ని ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోవడమే కాదు... అందులో ఉన్న బీర్ మొత్తం చుక్క కూడా వదలకుండా తాగేసింది. ఒకరు ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేయగా... అది కాస్త వైరల్ గా మారింది.
ఆ మద్యం తాగుతున్నప్పుడు కోతి ఎక్స్ ప్రెషన్స్ మరింత హైలెట్ గా నిలవడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలి లో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా.. తరచూ ఆ ప్రాంతంలో కోతులు ఇలా చేస్తూ ఉంటాయట. మందు బాబుల దగ్గర నుంచి కూడా మందు లాక్కొని తాగుతూ ఉంటాయట. ఈ వీడియోకి నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.