
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై పార్టీలో నాయకుల మధ్య అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. పలువురు ఆమెకు మద్దతుగా మాట్లాడుతుంటే, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే నూపుర్ శర్మను పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ ఇంకా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చల్లారడం లేదు. దీంతో తాజాగా బీజేపీకి చెందిన ఓ నాయకురాలు పార్టీకి రాజీనామా చేశారు.
మహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలను నిరసిస్తూ రాజస్థాన్ బీజేపీ నాయకురాలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమె ఆ రాష్ట్రంలోని కోటా మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా ఉన్నారు. దక్షిణ వార్డ్ నంబర్ 14 నుండి బీజేపీ తరుఫున గెలుపొందిన తబస్సుమ్ మీర్జా ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ సతీష్ పూనియా, కోట జిల్లా అధ్యక్షుడు క్రిషన్ కుమార్ సోనీకి అందజేశారు.
Amarnath Yatra2022: అమర్‌నాథ్ యాత్రకు వెళుతున్నట్లయితే.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. లేకుంటే..
రాష్ట్ర నాయకత్వానికి అందజేసిన లేఖలో తన రాజీనామా కు గల కారణాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల్లో ఇక బీజేపీతో కలిసి పని చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ సభ్యురాలిగా ఉన్నందుకు విచారం వ్యక్తం చేశారు. ‘నబీ’ని విమర్శించిన దాని సభ్యులపై చర్య తీసుకోవడంలో పార్టీ విఫలమైందని ఆరోపించారు.
‘‘పార్టీలో (మహమ్మద్ ప్రవక్తపై) చాలా వ్యతిరేకత ఉన్నప్పకటికీ నేను ఇంకా మద్దతు ఇస్తూ ఇందులోనే కొనసాగితే నన్ను మించిన పెద్ద అపరాధి మరొకరు ఉండరు. ఇప్పుడు నా స్పృహ మేల్కొంది. నేను పార్టీలో ఇక కొనసాగలేను.’’ అని బీజేపీ రాజస్థాన్ చీఫ్ కు లేఖలో ఆమె పేర్కొంది. కాగా తబస్సుమ్ మీర్జా దాదాపు 10 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. అయితే మరోవైపు తబస్సుమ్ మీర్జా రాజీనామా విషయాన్ని కోట జిల్లా అధ్యక్షుడు క్రిషన్ కుమార్ ఖండించారు. ఆమె నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని తెలిపారు.
UP Bulldozer Action: "బుల్డోజర్ చర్య అనైతికం".. సుప్రీంను ఆశ్రయించిన జమియత్ ఉలేమా-ఎ-హింద్
జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో బీజేపీ మాజీ అధికార ప్రతినిధఙ నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయాగ్ రాజ్ తో పాటు మరి కొన్ని పట్ణణాల్లో ఆందోళనలు జరిగాయి. గత శుక్రవారం కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లోని హౌరా చేపట్టిన నిరసనలు కూడా హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్‌లో నిరసనల సందర్భంగా కొందరు పోలీసు అధికారులు గాయపడ్డారు. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. యూపీలోని పలు జిల్లాలో ఆగస్టు 10వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. పశ్చిమబెంగాల్ లో కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఓ రైలుపై నిరసనకారులు దాడి చేశారు.