Asaduddin Owaisi: భార‌త్ ప‌రువు పోగొట్టింది.. నూపుర్ శర్మను అరెస్టు చేయండి: ఒవైసీ డిమాండ్

Published : Jun 06, 2022, 03:57 PM IST
Asaduddin Owaisi: భార‌త్ ప‌రువు పోగొట్టింది.. నూపుర్ శర్మను అరెస్టు చేయండి: ఒవైసీ డిమాండ్

సారాంశం

Nupur Sharma:  బీజేపీ మాజీ అధికార ప్ర‌తినిధి నూపుర్ శ‌ర్మ..  మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. అరబ్ ప్రపంచంలో భారతదేశం పరువు పోగొట్టుకునేలా చేసింద‌ని హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు. నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.   

Prophet remark row: మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించి, భారతదేశాన్ని ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టివేసిన బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్టు చేయాలని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం డిమాండ్ చేశారు. ''భారతదేశం పరువు కోల్పోయింది. దేశ విదేశాంగ విధానాన్ని నాశనం చేశారు. సస్పెన్షన్ మాత్రమే కాకుండా నూపుర్ శర్మను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను”అని ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. అలాగే, విదేశాంగ మంత్రిత్వ శాఖమైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. “విదేశాంగ శాఖ బీజేపీలో భాగమైందా? గల్ఫ్ దేశాల్లో భారతీయులపై విద్వేషపూరిత నేరాలు, హింస చోటుచేసుకుంటే మీరేం చేస్తారు? అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడానికి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన అధికార ప్రతినిధులను పంపుతుందని , అంతర్జాతీయ వేదికపై తమ నాయకుల వ్యాఖ్యలకు ఫ్లాక్ అయిన తర్వాతే చర్య తీసుకుంటున్న‌ద‌ని ఆరోపించారు .

"నేను ఇంతకుముందు ప్రధానికి విజ్ఞప్తి చేశాను, కానీ అతను విన‌లేదు. గల్ఫ్‌లో విషయం బయటకు పొక్కిన తర్వాతే చర్యలు తీసుకున్నారు. ఇది త్వరగా చేసి ఉండాల్సింది. తమ అధికార ప్రతినిధి ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని గ్రహించేందుకు బీజేపీకి 10 రోజులు పట్టింది" అని అన్నారు.  ఒవైసీ మాట్లాడుతూ.. "ఇది ఎలాంటి విదేశాంగ విధానమో నాకు అర్థం కావడం లేదని అన్నారు. సెక్యులర్ దేశాలు కూడా ఈ విషయంపై మౌనం వహించాయి, కానీ నిన్న సాయంత్రం నుండి ఒక్కసారిగా అందరూ యాక్టివ్‌గా మారారు మరియు ఇప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. నా సూచన మేరకు మీరు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు? పరాయి వాళ్ల సంగతి నీకు అర్థం అవుతుందా, మా సమస్యలు అర్థం కావడం లేదు" అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

దాదాపు 10 రోజుల క్రితం టీవీ చర్చలో నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు మరియు ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ ఇప్పుడు తొలగించిన ట్వీట్లు దేశంలో నిరసనలు మరియు హింసకు దారితీశాయి. అలాగే అనేక ముస్లిం దేశాల నుండి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి. ప్రవక్త గురించి బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన‌ వ్యాఖ్యల‌పై పలు అరబ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన పలు దేశాలు.. బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలిపాయి. మరోవైపు, ఈ విషయంలో ఓఐసీ భారత్‌పై చేసిన ఆరోపణలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. OIC సెక్రటేరియట్ చేసిన అనుచితమైన మరియు సంకుచితమైన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుందని పేర్కొంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?