దేవేంద్ర ఫడ్నవీస్ కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్ లో మాజీ సీఎం..

Published : Jun 06, 2022, 01:29 PM IST
దేవేంద్ర ఫడ్నవీస్ కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్ లో మాజీ సీఎం..

సారాంశం

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి కరోనా  బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. 

ముంబై :  అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. శుక్రవారం నుంచి ఆయన లాతూర్ పర్యటనలో ఉన్నారు. శనివారం లాతూర్ లో ఉండగా అస్వస్థతకు గురి కావడంతో పర్యటన ముగించుకుని సాయంత్రం ముంబైకి చేరుకున్నారు. ఆ తర్వాత వైద్యపరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆదివారం షోలాపూర్ పర్యటనను కూడా  రద్దు చేసుకున్నారు.

ప్రస్తుతం ఫడ్నవీస్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యం అందిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా ఈ నెల 10న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహంపై ఆదివారం సాయంత్రం సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఫడ్నవీస్ కు కరోనా కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

కాగా, భార‌త్ లో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారంనాటి లెక్కల ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3962 కరోనా కేసులు (కోవిడ్ 19) నమోదయ్యాయి. అంతకుముందు శుక్రవారం 4 వేల 41 కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం కేసులు దక్షిణాది రాష్ట్రమైన కేరళలోనే నమోదు కావడం గమనార్హం. కేరళతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
గత 3 నెలల్లో.. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల న‌మోద‌య్యింది. అయితే, అనూహ్యంగా గత వారం నుండి కేసులలో పెరుగుదల క‌నిపించ‌డం ఆందోళన కలిగిస్తుంది. మే 27 చివరి నాటికి 15708 కేసులు నమోదవగా.. జూన్ 3 నాటికి ఆ కేసుల సంఖ్య‌ 21 వేల 55కి పైగా చేరింది. అదనంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.52 శాతం నుండి 0.73 శాతానికి పెరిగింది. 
ఈ నివేదిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. స్థానికంగా వ్యాధి వ్యాప్తి పెరిగే అవకాశం క‌నిపిస్తుందని వైద్యులు భావిస్తున్నారు.  

ఇక, మహారాష్ట్రలో గ‌డిచిన‌ 1357 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వరుసగా మూడో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం గ‌మ‌నార్హం. శ‌నివారం న‌మోదైన‌1357 కేసుల్లో 889 కేసులు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఫిబ్రవరి 4న నగరంలో 846 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5888 మంది కోవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 78 లక్షల 91 వేల 703 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని,  క‌రోనా కారణంగా 1 లక్ష 47 వేల 865 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌ బారిన పడి ఇప్పటివరకు 77 లక్షల 37 వేల 950 మంది కోలుకున్నారు.

కాగా, జూన్ 1 న కేరళలో పాఠశాల సీజన్ ప్రారంభమైనందున.. జీవితం ఆచరణాత్మకంగా పాత సాధారణ స్థితికి చేరుకుంది, అయితే.. శనివారం కోవిడ్ కేసుల సంఖ్య 1,500 నుండి 1,544 పెరిగింది.అదే స‌మ‌యంలో నాలుగు మరణాలు సంభ‌వించాయి. ఈ నెల ప్రారంభంలో కేసులు వరుసగా... 1370, 1278,1465 లుగా నమోద‌య్యాయి, ఇన్‌ఫెక్షన్ రేటు పెరగడంతో ప్ర‌జ‌లు ఆందోళ‌నకు గుర‌వుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం