Priyanka Gandhi: కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి క‌రోనా పాజిటివ్

Published : Jun 03, 2022, 11:16 AM IST
Priyanka Gandhi:  కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీకి క‌రోనా పాజిటివ్

సారాంశం

Congress leader Priyanka Gandhi: త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌నీ, తెలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయనీ కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా వెల్ల‌డించారు. తాను హోం ఐసోలేష‌న్ ఉన్నాన‌ని తెలిపారు.   

Priyanka Gandhi Tests COVID Positive: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన ఒక రోజు తర్వాత, ఆమె కుమార్తె,  కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా క‌రోనా సోకింద‌ని ప‌రీక్ష‌ల్లో తేలింది. త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకింద‌నీ, తెలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయనీ కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా  ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తాను హోం ఐసోలేష‌న్ ఉన్నాన‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ కు సంబంధించిన లేలిక‌పాటి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలిపారు. 

 

అంత‌కుముందు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఆమె ఐసోలేష‌న్‌లో చిక్సిత పొందుతున్నార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు  కాంగ్రెస్ నేత ర‌ణ్‌దీప్ సుర్జేవాలా ట్విట‌ర్‌లో వివ‌రాలు తెలిపారు. ‘‘బుధవారం సాయంత్రం సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం వచ్చిందని, ఇత‌ర క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధప‌డ్డారు. ఆ తర్వాత ఆమెను పరీక్షించినప్పుడు ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. ఆమె ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు’’ అని చెప్పారు. సోనియా గాంధీ గత వారంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలను కలిశారని, దాని వల్లే తనకు ఇన్ఫెక్షన్ సోకిందని సూర్జేవాలా చెప్పారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఆందోళ‌న చెందుతున్నారు.

 

ఈ క్ర‌మంలో సోనియా గాంధీ ప్ర‌స్తుతానికి ఆరోగ్యం బాగానే ఉంద‌నీ, ఆమె త్వ‌ర‌గానే  కోలుకుంటున్నారు. ప్ర‌క‌టించిన దాని ప్ర‌కార‌మే సోనియా గాంధీ ఈ నెల 8న  ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారు. సోనియా గాంధీ ఆరోగ్యంపై మేము వివ‌రాలు అందిస్తూ ఉంటామ‌నీ, ఆమెను గ‌త వారం రోజులుగా క‌లిసిన నేతలందరినీ క‌రోనా ప‌రీక్ష చేయించికోవాల్సిన  విజ్ఞప్తి చేశారు. కాగా, నేష‌నల్ హెరాల్డ్ దిన‌ప‌త్రికకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. జూన్ 8న సోనియాను ఈడీ ప్రశ్నించనుండగా, రాహుల్‌ను గురువారం హాజరుకావాలని కోరింది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు