తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఫోన్ వాట్సాప్ మాల్‌వేర్ (పెగాసస్) ద్వారా హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ హ్యాక్‌ను ప్రభుత్వమే చేయించిందని, ఈ విషయంలో కేంద్రం కుట్రపూరిత మౌనాన్ని అవలంబిస్తోందన్నారు.వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రయత్నిస్తోందని చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఫోన్ వాట్సాప్ మాల్‌వేర్ (పెగాసస్) ద్వారా హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా, పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మంత్రులు, అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వల్ల ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఫోన్లు హ్యాక్‌కు గురైనట్లు వాట్సాప్ తెలిపింది.
undefined
also read సరి-బేసి విధానం.... బీజేపీ ఎంపీకి జరిమానా
ఈ విషయాన్ని యూజర్లకు తెలిపేందుకు వాట్సాప్ ప్రత్యేక సందేశాలను బాధితులకు పంపింది. ఇలాంటి సందేశం ప్రియాంకాగాంధీ ఫోన్‌కు కూడా వచ్చినట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆదివారం స్పష్టంచేశారు. అయితే, పెగాసస్ వల్లనే హ్యాక్ అయినట్లు ఆ వాట్సాప్ సందేశం పేర్కొనలేదని చెప్పారు.
ఈ హ్యాక్‌ను ప్రభుత్వమే చేయించిందని, ఈ విషయంలో కేంద్రం కుట్రపూరిత మౌనాన్ని అవలంబిస్తోందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇలా టార్గెట్ చేసిన వారిలో జర్నలిస్టులు, న్యాయవాదులు సహా ప్రభుత్వ అధికారులు ఉన్నట్టు ఫేస్‌బుక్ పేర్కొంది.
also read ప్రాణం తీసిన గుడ్డు... రూ.2వేల కోసం 41కోడిగుడ్లు తిని...
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత్‌కు చెందిన 121 మందిని టార్గెట్ చేసుకుందని సెప్టెంబర్‌లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని వాట్సాప్ సంస్థ చెబుతోంది. అయితే, దీనిపై వాట్సాప్ తమకు పూర్తి సమాచారం ఇవ్వలేదని ఐటీ శాఖ పేర్కొంది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రెండు పార్లమెంటరీ కమిటీలు ఫోన్ హ్యాకింగ్‌పై సమావేశాలు జరపనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని హోంశాఖ కార్యదర్శి ద్వారా తెలుసుకోనున్నాయి. ఇప్పటి వరకూ జరిగిన ఘటనలు చాలా బాధ కలిగించినవి అని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. 15న జరగనున్న భేటీలో కశ్మీర్‌తో పాటు వాట్సాప్ అంశాన్ని కూడా చర్చిస్తామని తెలిపారు.