ప్రాణం తీసిన గుడ్డు... రూ.2వేల కోసం 41కోడిగుడ్లు తిని...

By telugu teamFirst Published Nov 5, 2019, 11:08 AM IST
Highlights

ఎవరు ఎక్కువ తింటే.. వారికి రూ.2వేలు ఇవ్వాలని పందెం కాసుకున్నారు. పందెంలో భాగంగా 50 కోడిగుడ్లు తినాల్సి ఉంది. కాగా... తన ఫ్రెండ్ కాచిన పందెనికి  సై అన్నాడు. 50 కోడిగుడ్లలో 41 గుడ్లు తినేశాడు. 42వ కోడిగుడ్డు తినే సమయంలో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

కోడి గుడ్డు... ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కేవలం రూ.2వేల కోసం స్నేహితుడితో పందెం కాశాడు. ఆ పందెం కోసం... ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా  41 కోడిగుడ్లు తిన్నాడు. అన్ని కోడిగుడ్లు తినడం వల్లే.. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... జాన్ పూర్ జిల్లాకి చెందిన సుభాష్ యాదవ్(42) సోమవారం జాన్ పూర్ లోని బీబీగంజ్  మార్కెట్ కి వెళ్లాడు. అక్కడ సుభాష్  యాదవ్, అతని మిత్రుడు కోడి గుడ్లు తినడానికి వెళ్లారు. ఆ విషయంలో ఎవరు ఎక్కవ తినగలరు అనే విషయంలో కాసేపు వాదులాడుకున్నారు. చివరకు రూ.2వేల పందెం కట్టారు.

AlsoRead లంచ్ బాక్స్ కోసం గొడవ... కత్తితో పొడిచి మరీ హత్య...

ఎవరు ఎక్కువ తింటే.. వారికి రూ.2వేలు ఇవ్వాలని పందెం కాసుకున్నారు. పందెంలో భాగంగా 50 కోడిగుడ్లు తినాల్సి ఉంది. కాగా... తన ఫ్రెండ్ కాచిన పందెనికి  సై అన్నాడు. 50 కోడిగుడ్లలో 41 గుడ్లు తినేశాడు. 42వ కోడిగుడ్డు తినే సమయంలో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

గమనించిన స్థానికులు వెంటనే అతనిని జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అక్కడి వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  కి తరలించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే అతను మృతి చెందాడు.

AlsoRead దీపావళి బహుమతి... కోరియర్ సంస్థకు భారీ జరిమానా...

అతిగా తినడం వల్లే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా... ఈ ఘటనపై మాట్లాడటానికి సుభాష్ యాదవ్ కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!