Priyanka Gandhi Arrest : ఆమె ‘నిర్భయ’.. ‘అసలైన కాంగ్రెస్ వాది’... రాహుల్ గాంధీ ట్వీట్...

By AN TeluguFirst Published Oct 5, 2021, 11:53 AM IST
Highlights

"ఎవరినైతే మీరు అరెస్ట్ చేశారో.. ఆమె దేనికీ భయపడే రకం కాదు. సిసలైన కాంగ్రెస్ వాది. పరాజయాన్ని అంగీకరించదు. సత్యాగ్రహం అగదు.’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. 

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్టు (Priyanka Gandhi Arrest) చేయడం వల్ల "నిజం కోసం అహింసా మార్గంలో చేసే నిరసనను" ఆపలేరు.. అని ప్రియాంకా సోదరుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)అన్నారు. ఈ మేరకు ట్విటర్ లో మంగళవారం స్పందిస్తూ.. ప్రియాంకను "నిర్భయ"(fearless), "నిజమైన కాంగ్రెస్ వాది" (true Congressi) అని పేర్కొన్నారు. 

ఢిల్లీకి దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న లఖింపూర్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గత మూడు రోజులుగా టార్గెట్ చేశాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోవడం తీవ్ర దుమారానికి కారణమయ్యింది. ఈ హత్య కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పేరు మాత్రమే ఉంది.

"ఎవరినైతే మీరు అరెస్ట్ చేశారో.. ఆమె దేనికీ భయపడే రకం కాదు. సిసలైన కాంగ్రెస్ వాది. పరాజయాన్ని అంగీకరించదు. సత్యాగ్రహం అగదు.’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. 

ప్రియాంకా వాద్రా(49) సోమవారం యుపి జిల్లాకు వెళ్తున్నప్పుడు ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. మంగళవారం ఉదయం ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారామె. నిందితుడైన  కేంద్రమంత్రి కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, తనను అరెస్టు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

ఆదివారం హింసాకాండ తర్వాత మనుషుల కదలికల మీద నిఘా పెట్టబడింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ సమయంలో  జిల్లాను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆమె, "నన్ను ఆరు నెలలు లేదా ఆరు సంవత్సరాలు నిర్బంధించినా..సమస్య లేదు."

"ఆర్డర్ లేదా ఎఫ్ఐఆర్ లేకుండా, నేను 28 గంటలకు పైగా నిర్బంధంలో ఉన్నాను" అని ప్రియాంకా వాద్రా ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆమె ఘటనకు సంబంధించినదిగా పేర్కొంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. 

మోడీగారు.. మీరు లఖీంపూర్ వెళ్ళగలరా?.. ప్రధానికి ప్రియాంకా గాంధీ సూటిప్రశ్న..

సోమవారం, లఖింపూర్‌లో జరిగిన ఘటనకు మద్ధతుగా బయలు దేరిన అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలను యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీలో కూడా మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్రదర్శనలు నిర్వహించారు.

అయితే, ఘటనకు కారణంగా చెబుతున్న మిశ్రా మాత్రం ఎనిమిది మందిపైకి దూసుకెళ్లిన కారులో తాను లేనని ఖండించారు. "నేను కారులో లేను. రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతున్న బన్వీర్‌పూర్ గ్రామంలోని మా పూర్వీకుల ఇంట్లో ఉన్నాను. ఉదయం నుండి ఈవెంట్ ముగిసే వరకు నేను అక్కడే ఉన్నాను" అని అతను ఎన్డీటీవీకి చెప్పాడు.

click me!