తమ్ముడి వరసైన వ్యక్తితో గర్భం.. చెత్తకుండిలోకి బిడ్డ, మృత్యుఒడిలోకి తల్లి.. !!

Published : Apr 23, 2021, 01:13 PM IST
తమ్ముడి వరసైన వ్యక్తితో గర్భం.. చెత్తకుండిలోకి బిడ్డ, మృత్యుఒడిలోకి తల్లి.. !!

సారాంశం

మితిమీరిన శారీరక వాంఛలు వావివరసలు మరిచిపోయేలా చేస్తాయి. దీని పర్యవసానంగా బతుకులు చిద్రం అవ్వడం సదరు వ్యక్తులు నేరస్తులుగా మారడం... చివరికి ప్రాణాలు పోవడంతో కథ సుఖాంతం అవుతుంది.. అలాంటి ఓ విషాదకర ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

మితిమీరిన శారీరక వాంఛలు వావివరసలు మరిచిపోయేలా చేస్తాయి. దీని పర్యవసానంగా బతుకులు చిద్రం అవ్వడం సదరు వ్యక్తులు నేరస్తులుగా మారడం... చివరికి ప్రాణాలు పోవడంతో కథ సుఖాంతం అవుతుంది.. అలాంటి ఓ విషాదకర ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెకు పరువుకు భయపడి కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతి చెందింది. వెంనటే పుట్టిన బిడ్డను చెత్త కుండీ లో పడేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఆమె ప్రియుడు, కుటుంబ సభ్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్‌ కుమార్తె మంగయకరసి(29) ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది.  2019లో కోవిద్ లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ ఉంది. 

ఈ సమయంలో వారి ఇంట్లో తమ్ముడి వరసయ్యే, సమీప బంధువైన ఓ యువకుడు ఉండేవాడు. అతనితో మంగయకరసి దగ్గరైంది. ఇద్దరు చనువుగా ఉన్నా కుటుంబీకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం ఆ యువకుడు మంగయకరసికి తమ్ముడు వరస కావడమే.

నా భార్య చనిపోతోంది.. ప్లీజ్ చేర్చుకోండి: కంటతడి పెట్టిస్తోన్న ఓ భర్త ఆక్రందన...

అయితే వీరి చనువు హద్దులు దాటి.. మంగయకరసి గర్భం దాల్చింది. అబార్షన్ కూడా చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఆ కుటుంబం  తీవ్ర మనోవేదనలో పడింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తితో ఆమె గర్భందాల్చిన సమాచారం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని జాగ్రత్తపడ్డారు. ఆమెను ఇంట్లోనే ఉంచారు.

కొద్ది రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో ఇంట్లోనే కుటుంబీకులు ప్రసవం చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తీవ్ర రక్తస్రావంతో మంగయకరసి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

దీంతో ఆ బిడ్డను తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశారు. ఇంతవరకు ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడ్డా కూడా.. మంగయకరసి ఆస్పత్రిలో మృతి చెందడం, ఆగమేఘాలపై మృతదేహానికి అంత్యక్రియలు జరగడం, ఇరుగుపొరుగు వారిలో అనుమానాల్ని రేకెత్తించాయి. దీంతో ఈ  వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో బండారం బయటపడింది.

ఇంట్లో ప్రసవం చేసిన విషయం తెలిసి ఆమె తల్లి తంగం, సోదరి గణేషప్రియ, తమ్ముడు కాళిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమె గర్భానికి కారకుడైన ప్రియుడు ఆదిశ్ కుమార్ ను కూడా అరెస్టు చేశారు. అయితే చెత్తకుండీలో బిడ్డను పడేసిన సమయంలో ప్రాణాలతో ఉన్నట్టుగా కాళిదాసు పేర్కొనడంతో ఆ బిడ్డ జాడ కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. ఎవరికైనా ఆ బిడ్డ దొరికిందా లేదా మరణించిందా అని ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలకు వేసవి వార్నింగ్.. ఐఎండీ బాంబు పేల్చిందిగా !
Kerala Elections: కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని మార్పు.. స‌ర్వేల్లో ఆస‌క్తిక‌ర విష‌యాలు