బీహార్ లో విషాదం: గంగానదిలో బోల్తాపడిన జీపు,10 మంది మృతి

Published : Apr 23, 2021, 12:27 PM ISTUpdated : Apr 23, 2021, 12:50 PM IST
బీహార్ లో విషాదం: గంగానదిలో బోల్తాపడిన జీపు,10 మంది మృతి

సారాంశం

బీహార్ రాష్ట్రంలో  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. గంగానదిలో జీపు బోల్తా పడింది.ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు.  

బీహార్ రాష్ట్రంలో  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. గంగానదిలో జీపు బోల్తా పడింది.ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు.. పాట్నా జిల్లాలోని  పీపాపుల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకంది.  నదిలో జీపు బోల్తా పడిన సమయంలో  జీపులో సుమారు 15 మంది ప్రయాణిస్తున్నారు. నదిలో పడినవారిలో 10 మంది మృత్యువాతపడినట్టుగా అధికారులు ప్రకటించారు.  మృతదేహలను నది నుండి బయటకు తీస్తున్నారు.


&nbs

p;

 

ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.జీపులో  ప్రయాణీస్తున్న వారంతా  ఒకే కుటుంబానికి చెందినవారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని  సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. జీపు గంగానదిలో పడిపోవడానికి గల కారణాలపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.  డ్రైవర్ నిర్లక్ష్యమా ప్రమాదవశాత్తు జీపు నదిలో పడిపోయిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.


 
 

 

PREV
click me!

Recommended Stories

Freedom of Speech: మాజీ సీఎం కొడుకైనా.. యూట్యూబర్ అయినా.. నోరు అదుపులో ఉంటేనే గౌరవం
Udhayanidhi Stalin: తంజావూర్ సభలో ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?