రైల్లో లైంగిక దాడి : సీఎం పళనిస్వామికి హైకోర్టు నోటీసులు.. !!

By AN TeluguFirst Published Apr 23, 2021, 12:48 PM IST
Highlights

తమిళనాడు సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎంపై డీఎంకే నేత రాజేంద్రన్ పరువు నష్టం దావా వేయడంతో కోర్టు స్పందించింది. ప్రతిపక్షాల నేతలు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే చాలు ప్రభుత్వం తరపు న్యాయవాదులు చటుక్కున కోర్టులో పరువునష్టం దావాలు వేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. పళనిస్వామిపై దావా వేయడం చర్చకు దారితీసింది.

ఎన్నికల ప్రచారంలో కోయంబత్తూర్ వేదికగా సీఎం పళనిస్వామి రాజేందర్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతిపై లైంగిక దాడి యత్నం చేశారని ఆరోపించారు. దీన్ని రాజేంద్రన్‌ తీవ్రంగా పరిగణించారు. తాను చేయని నేరాన్ని, తనపై వేస్తూ, పరువుకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దావా వేశారు.

ఇటీవల తాను రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అత్యవసరంగా మూత్రవిసర్జనకు నిమిత్తమై పై బెర్త్ నుంచి కింది బెర్త్ కు దిగాల్సి వచ్చిందని, ఆ సమయంలో కింద ఉన్న యువతిపై జారి పడ్డాను.. అని ఆ దావాలో వివరించారు. తనకు మధుమేహం ఉందని అందుకే మూత్రవిసర్జన కోసం అత్యవసరంగా పరుగులు తీశానని, అయితే తానేదో అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా భావించిన ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పరిస్థితిని ఆ యువతికి వివరించిన తరువాత ఆమె శాంతించాలని గుర్తు చేశారు.

అయితే హఠాత్తుగా తనపై 15 రోజుల అనంతరం పోలీసులు కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో కోర్టు సైతం తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వివరించారు. అయితే ఎన్నికల సమయంలో తానేదో రైలులో లైంగికదాడి యత్నం చేసినట్టుగా సీఎం ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం తన పరువుకు భంగం కలిగించే రీతిలో ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోటి  నష్టపరిహారం కోరుతూ సీఎం పలని స్వామి కి దావా ద్వారా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి పార్థిబన్‌ నేతృత్వంలోని బెంచ్ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం సీఎం పళని స్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో మంత్రి ఎస్పీ వేలుమణిపై కూడా రాజేంద్రన్ దావా వేశారు.

click me!