లేడీస్ లోదుస్తులు వేసుకుని బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య!.. ఉరి తాడుకు ఆ దుస్తుల్లో వేలాడుతూ..!

Published : Jun 10, 2023, 04:31 PM IST
లేడీస్ లోదుస్తులు వేసుకుని బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య!.. ఉరి తాడుకు ఆ దుస్తుల్లో వేలాడుతూ..!

సారాంశం

పంజాబ్‌లోని లూధియానాలో ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ అనుమానాస్పద స్థితిలో విగత జీవై కనిపించాడు. అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. అతను లేడీస్ లో దుస్తులు వేసుకుని ఉండటం గమనార్హం.  

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని లూధియానా జిల్లాలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. కెనరా బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి తను అద్దెకు ఉంటున్న ఇంటిలో విగత జీవై కనిపించాడు. ఇంటి యజమాని తలుపలు తీయగా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. అయితే, అప్పుడు అతను ఆడవారి లోదుస్తులు ధరించి ఉరి తాడుకు వేలాడుతూ కనిపించి ఉండటం గమనార్హం. అక్కడ అద్దె ఇంటిలో ఆ వ్యక్తి ఒంటరిగానే జీవిస్తున్నాడు. అయినా.. ఆ ఇంటిలో ఆడవారి బట్టలు కనిపించాయి.

మృతుడిని వినోద్ కుమార్‌గా గుర్తించారు. ఫెరోజ్‌పూర్ నివాసి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఉద్యోగ రీత్య వినోద్ కుమార్ కుటుంబాన్ని వదిలి ఒక్కడే లూదియానాలోని అమర్‌పురాలోని ఓ ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్నాడు. సుమారు రెండేళ్లుగా అక్కడే అద్దెకు ఉంటున్నాడు. ఆయన ఇంటికి వెళ్లి మూడు నాలుగు రోజుల క్రితమే వచ్చాడు. 

Also Read: శరద్ పవార్‌ను చంపేస్తామని బెదిరించింది బీజేపీ కార్యకర్తనే: అజిత్ పవార్

శనివారం రోజు ఉదయం లేచి బ్యాంకుకు వెళ్లే వినోద్ కుమార్ ఎంతకీ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఓనర్ ఆ గది తలుపు తట్టాడు. చాలా సేపు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో బలవంతంగా డోర్ ఓపెన్ చేశాడు. లోపలి దృశ్యం చూసి ఖంగుతిన్నాడు. లోపల వినోద్ కుమార్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. అతను మహిళల లోదుస్తులు వేసుకుని ఉన్నాడు.

ఈ విషయం వెంటనే ఆ ఏరియా కౌన్సిలర్ గుర్దీప్ సింగ్ నీతుకు తెలిపారు. అనంతరం, పోలీసులుకు సమాచారం అందియ్యడంతో వారు స్పాట్‌కు వచ్చారు. అనుమానాస్పద మృతిగా భావించారు. ఫోరెన్సిక్ టీమ్‌ను కూడా స్పాట్‌కు రప్పించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌