పూల రేకులపై అందమైన చిత్రాలు.. అయోధ్య ఆలయానికి కొత్త శోభ , ఈ కళాకారుడి పనితనానికి ఫిదా అవ్వాల్సిందే

By Siva Kodati  |  First Published Dec 30, 2023, 7:43 PM IST

గుజరాత్‌కు చెందిన పూల వ్యాపారి అశోక్ బన్సాలీ అయోధ్య ఆలయ సముదాయానికి ప్రత్యేకమైన పూల అలంకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రామ్ లల్లా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చిత్రాలతో వున్న గులాబీలను ప్రదర్శించారు. 


అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత ప్రభుత్వంతో పాటు యూపీ సర్కార్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. అలాగే దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం అయోధ్యధామ్ రైల్వే స్టేషన్, విమానాశ్రాయాలకు ఆధునిక హంగులు అద్దారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యలోని పవిత్రమైన మైదానాన్ని అలంకరించడానికి దేశవ్యాప్తంగా పలు విశిష్ట వస్తువులను సేకరిస్తున్నారు. 108 అడుగుల ఎత్తైన ధూప్ స్టిక్, బంగారు విల్లు, బాణం, 8 లోహాల కలయికతో రూపొందించిన 2100 కేజీల గంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

ఈ వైభవానికి పూల సొగసును జోడిస్తూ, గుజరాత్‌కు చెందిన పూల వ్యాపారి అశోక్ బన్సాలీ ఆలయ సముదాయానికి ప్రత్యేకమైన పూల అలంకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పువ్వులను రామ్ లల్లా పేరు , "జై శ్రీ రామ్" అనే నినాదంతో సంక్లిష్టంగా రూపొందించి దేవతా విగ్రహం దగ్గర సున్నితంగా ఉంచారు. బన్సాలీ వినూత్న ప్రయాణంలో పదాలు, చిత్రాలను సున్నితమైన పూల రేకులపై ముద్రించే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి నాలుగేళ్ల శ్రమ దాగి వుంది. రామ్ లల్లా, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చిత్రాలతో వున్న గులాబీలను ప్రదర్శించారు. 

Latest Videos

మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో బన్సాలీ.. ప్రతి రేకును చేతితో ముద్రించారు. ఇందుకోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించారు. అయోధ్య ఆలయ సముదాయం కోసం ఉద్దేశించిన ఇండోర్ మొక్కల ఆకులపై ఇలాంటి చిత్రాలను ముద్రించాలని ఆయన యోచిస్తున్నాడు. 2020లో జరిగిన అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమంలో బన్సాలీ 500 పూలతో చేసిన అద్భుతానికి ప్రశంసలు దక్కాయి. ఈసారి శ్రీరాముని పూజ కోసం 300 నుంచి 4000 పుష్పాలను అందుబాటులో వుంచాలని ఆయన నిర్ణయించారు. 

జనవరి 16న ప్రారంభమయ్యే ఏడు రోజుల మెగా వేడుకకు ముమ్మరంగా సన్నాహాలు సాగుతున్నాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు రామ్ కథా పార్క్‌లో పూల కళాఖండాలను శ్రద్ధగా రూపొందిస్తున్నారు. ఈ డిజైన్‌లు శ్రీరాముని విల్లు , బాణం, హనుమంతుడు, పవిత్ర తిలకం నుంచి ప్రేరణ పొందాయి. జనవరి 22న జరిగే పవిత్రోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనుంది. ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. 

click me!