జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు టీచర్లను టెర్రరిస్టులు గురువారంనాడు కాల్చి చంపారు. ఐదు రోజుల వ్యవధిలో ఏడుగురిని ఉగ్రవాదులు చంపారు. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురిని చంపారు.ఈ ఘటన మరువకముందే మరో ఇద్దరిని హత్య చేశారు.
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ స్కూల్ ప్రిన్పిపల్ , టీచర్ ను ఉగ్రవాదులు గురువారం నాడు కాల్చి చంపారు. మంగళవారం నాడు terrorists ముగ్గురిని చంపారు.ఈ ఘటన జరిగి 48 గంటల పూర్తి కాకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.
also read:జమ్మూలో ఎన్‌కౌంటర్: పుల్వామా దాడి ఘటనలో కీలకపాత్రధారి లంబూ సహా అనుచరుడి మృతి
గత ఐదు రోజుల్లో టెర్రరిస్టుల దాడుల్లో ఏడుగురు మరణించారు. ప్రభుత్వ స్కూల్‌లో ఇద్దరిని చంపిన ఘటనలో రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ చెప్పారు.
జమ్మూకు చెందిన ఉపాధ్యాయుడు దీపక్ చంద్ శ్రీనగర్ కు శివారులోని సంగం హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. ఇదే స్కూల్ లో సుపుందర్ కౌర్ టీచర్ గా పనిచేస్తున్నారు. శ్రీనగర్ జిల్లాలోని సంగం ఈద్గా వద్ద ఇవాళ ఉదయం 11:15 గంటల సమయంలో టెర్రరిస్టులు ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చి చంపారని పోలీస్ అధికారి తెలిపారు.
టీఆర్ఎఫ్ కరాచీ నుండి నడుస్తోందని పోలీసులు చెప్పారు. మృతులు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. బాధితులు ఆర్ఎస్ ఎస్ తో కలిసి పనిచేస్తున్నారని టీఆర్ఎఫ్ దుష్ప్రచారం చేస్తోందని జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాల్ సింగ్ చెప్పారు.ఈ ఘటనను జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా ఖండించారు.
శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ లోని ఫార్మసీ యజమాని లాల్ బింద్రూను తన స్టోర్ లోపలనే టెర్రరిస్టులు మంగళవారం నాడు కాల్చారు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.