50 మందికి పైగా బాలికల ఫొటోలు మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేరింగ్... ఐఐటీ స్టూడెంట్ అరెస్ట్..

By AN TeluguFirst Published Oct 7, 2021, 2:01 PM IST
Highlights

పాట్నాకు చెందిన మహావీర్, IIT- ఖరగ్‌పూర్ లో బీటెక్ చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను ఉత్తర ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ పాఠశాలలోని 50కి పైగా విద్యార్థినులను, టీచర్లను వేధించాడు.

న్యూఢిల్లీ : బీహార్ కు చెందిన ఓ ఐఐటి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఓ ప్రఖ్యాత పాఠశాలలోని విద్యార్థినులు, ఉపాధ్యాయుల వెంటపడడం వారి మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినందుకు 19 ఏళ్ల ఈ IIT Student ను  గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాట్నాకు చెందిన మహావీర్, IIT- ఖరగ్‌పూర్ లో బీటెక్ చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను ఉత్తర ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ పాఠశాలలోని 50కి పైగా విద్యార్థినులను, టీచర్లను వేధించాడు.

వీరిని వేధించే క్రమంలో వారితో పరిచయం పెంచుకోవడానికి మహావీర్ నకిలీ కాలర్ ఐడి , వర్చువల్ నంబర్లు వాడి వాట్సప్‌లో వారితో పరిచయం పెంచుకునేవాడు. తన identity తెలియకుండా ఉండడం కోసం అతను voice changing appని కూడా వాడేవాడు.

ఆ తరువాత వారి మార్ఫ్ డ్ ఫోటోలను.. వారి పేరుతో మహావీర్ fake Instagram అకౌంట్లను  సృష్టించేవాడని పోలీసులు తెలిపారు. వాటిల్లో సదరు morphed photos షేర్ చేస్తూ వారిని వేధించేవాడు. 

ఈ సైబర్ స్టాకింగ్‌కు సంబంధించి బుధవారం పాఠశాల నిర్వాహకుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదు ప్రకారం, నిందితులు social media లో మైనర్ బాలికలను గుర్తించి, వారికి వాట్సాప్‌లో మెసేజ్ లు పెట్టేవారు.

ఇక టీచర్లను మరో రకంగా వేధించేవాడు. వారికి అంతర్జాతీయ నంబర్లనుంచి ఫోన్ లు, వాట్సాప్ మెసేజ్ లు చేసేవాడు. అలాగే ఐఐటి విద్యార్థి ఆన్‌లైన్ తరగతుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. క్లాసుల్లోకి చొరబడడ్డానని, పాఠశాల విద్యార్థుల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 
షేర్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇతని మీద సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354-D (స్టాకింగ్) కింద కేసు నమోదు చేయబడింది. సాంకేతిక సహాయం కోసం జిల్లాలోని సైబర్ సెల్ యూనిట్ కూడా సహాయం చేసింది. ఈ కేసులో ఆ తరువాత పోక్సో చట్టం,  IT చట్టంలోని సంబంధిత సెక్షన్లు కూడా చేర్చామని డిప్యూటీ పోలీసు కమిషనర్ సాగర్ సింగ్ కల్సి చెప్పారు.

విచారణలో భాగంగా పోలీసులు పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విచారించారు. నిందితులు 33 వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఐదు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లు, నకిలీ కాలర్ ఐడి యాప్‌లను ఉపయోగించి చేసిన అనేక కాల్‌లను గుర్తించగలిగామని పోలీసు అధికారులు తెలిపారు.

"మా బృందం సోషల్ మీడియా అకౌంట్లైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లను క్రియేట్ చేయడానికి వాడిన నకిలీ మెయిల్ ఐడి ఐపి లాగ్‌ల వివరాలను విశ్లేషించింది. దీంతో  నిందితుడు మహావీర్‌గా గుర్తించాం.. ఆ తర్వాత అతడు బీహార్‌లోని పాట్నాలో గుర్తించి, అరెస్ట్ చేశాం" అని కల్సి చెప్పారు

మలేరియాకు తొలి టీకా వచ్చేసింది.. ఆమోదించిన డబ్ల్యూహెచ్‌వో.

మొబైల్ నంబర్లను దర్యాప్తు చేస్తున్నక్రమంలో నిందితుడు మూడేళ్ల క్రితం బాధితులలో ఒకరిని సంప్రదించాడని, అప్పటి నుండి ఆమెను వెంటాడి వేధిస్తున్నాడని పోలీసులకు తెలిసింది. "మహావీర్ ఓ IITలో B. Tech చదువుతున్నాడు. ముందు అతను ఒక విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె Instagram, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమె స్నేహితులను కాంటాక్ట్ చేయడం ప్రారంభించాడు. మహావీర్ కు యాప్‌లపై మంచి అవగాహన ఉంది. దీంతో అతను వాటిని ఉపయోగించి, మైనర్ బాలికలను ఇబ్బందిపెట్టాడు, వేధించాడు "అని డిసిపి చెప్పారు.

నిందితుడి మొబైల్ ఫోన్‌లో అనేక అసభ్యకర వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయి. అతని ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

click me!