కొచ్చి మెట్రో ప్రాజెక్టు విస్తరణ .. ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న‌

By Rajesh KFirst Published Sep 1, 2022, 2:48 PM IST
Highlights

కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ విస్తరణను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 6 గంటలకు 
ప్రారంభించనున్నారు. దీంతో పాటు రెండో దశ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొచ్చిలో జరిగే బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు.

కేర‌ళ‌లోని కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పొడిగింపు ప‌నుల‌ను గురువారం సాయంత్రం 6 గంటలకు 
 ప్రధాని మోదీ ప్రారంభించ‌నున్నారు. అదే స‌మయంలో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయ‌నున్నారు. ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పొడిగింపు లో భాగంగా.. పేట నుంచి ఎస్ఎన్ జంక్షన్ మధ్య దూరం 1.8 కి.మీ. ఎలివేటెడ్ అర్బన్ రైల్ నెట్‌వర్క్  అందుబాటులోకి తీసుకరానున్నారు. ఇందుకోసం ప్ర‌భుత్వం 700 కోట్లను వెచ్చించారు.  మెట్రో రైల్ ప్రాజెక్ట్ యొక్క ఇంధన అవసరాలలో 55% సౌర విద్యుత్ ద్వారా అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
 
అలాగే.. జేఎల్ఎన్ స్టేడియం నుండి ఇన్ఫోపార్క్ వరకు ఏర్పాటు చేయ‌నున్న కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు రెండవ దశకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ద‌శ‌లో 11.2 కిలోమీటర్ల మేర నిర్మాణ ప‌నులు చేపట్ట‌నున్నారు.  ఇందులో 11 స్టేషన్లను ఏర్పాటు చేయ‌నున్నారు.  ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.1,950 కోట్లు గా అధికారులు పేర్కొన్నారు. 

విశేషమేమిటంటే.. మోడీ ప్రభుత్వం ప్రారంభించిన మెట్రో విప్లవంలో కొచ్చి మెట్రో రైలు ప్రాజెక్టు ఒక భాగం. 2014లో దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో నెట్‌వర్క్ ఉంది. కానీ.. నేడు 20 నగరాలు మెట్రో సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. 2014లో దేశం మొత్తం మెట్రో నెట్‌వర్క్ పొడవు కేవలం 248 కి.మీ. కాగా... నేడు మెట్రో నెట్‌వర్క్ పొడవు 775 కి.మీలకు పెరిగింది. దీంతో పాటు మ‌రో 1000 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

కొచ్చిలో బహిరంగ సభలో ప్రధాని ప్ర‌సంగం
 
కొచ్చిలో జరిగే బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే.. ఆదిశంకర్ జన్మభూమి ప్రాంతం కలాడిని ద‌ర్శించేందుకు  ఆయన వెళ్లనున్నారు. సాయంత్రం కొచ్చిలో మెట్రో రైలు పనులకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంత‌రం.. స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను   నౌకాదళంలోకి చేర్చనున్నారు. 

ఈ మేరుకు ప్ర‌ధాని ట్వీట్ చేస్తూ.. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సెప్టెంబర్ 2 చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు.  మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేరనుంది. అదే సమయంలో కొత్త నౌకాదళ ఎన్సైన్‌ను కూడా ఆవిష్కరించనున్నారు.

click me!