చిన్నతనంలో మొసలిని ఇంటికి తెచ్చిన మోదీ.. ఒకటో తరగతి పాఠ్యాంశంగా ప్రధాని సాహసం..

Published : Jun 20, 2022, 02:00 PM ISTUpdated : Jun 20, 2022, 02:01 PM IST
చిన్నతనంలో మొసలిని ఇంటికి తెచ్చిన మోదీ.. ఒకటో తరగతి పాఠ్యాంశంగా ప్రధాని సాహసం..

సారాంశం

తమిళనాడులోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ప్రధాని నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని ఒకటో తరగతి పిల్లల పాఠ్యాంశంగా చేర్చింది. 

తమిళనాడు : ప్రధానమంత్రి Narendra Modi చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. Tamilnadu రాష్ట్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనిని పాఠంగా పొందుపరిచింది.  2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన  మోడీ…‘నేను కొలనులో స్నానం చేస్తుండగా ఓ మొసలి పిల్లని చూసి దానిని ఇంటికి తీసుకు వచ్చాను.  దానిని చూసి మా అమ్మ తిట్టడం వల్ల తిరిగి ఆ కొలపేలోనే వదిలిపెట్టి వచ్చాను’  అని చెప్పారు.

ఈ సంగతి ఉదాహరణగా చూపించిన యాజమాన్యం.. నరేంద్ర మోడీ భారతదేశానికి 14 వ ప్రస్తుత ప్రధానమంత్రి. ఆయన చిన్నతనం నుంచి ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. బాల్యంలోనే ఓ ముసలి పిల్లను ఇంటికి పట్టుకు వచ్చారు’’ అని పుస్తకంలో ప్రచురించారు.  ప్రధానమంత్రి యావత్ దేశానికి పర్యవేక్షకుడు అని ముద్రించింది.అయితే, ప్రధానమంత్రి చిన్నతనంలోని సాహసాలను గురించి ప్రస్తావించడం, ఆయన ఆ వయసులో సాహనాలు ప్రదర్శించడం ఇదే మొదటిఘటన కాదు. 

గతంలో రన్నడే ప్రకాశన్ ‘బాల్ నరేంద్ర -  చైల్డ్  స్టోరీస్ ఆఫ్ నరేంద్ర  మోడీ’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో మోడీ బాల్యంలో చేసిన అనేక సాహసోపేత విషయాలను వెల్లడించారు. ఈ కథల్లో ఒకటి పాఠకులను విస్మయానికి గురి చేసింది… ‘మోదీ 8వ తరగతిలో ఉన్నప్పుడు కొలనులో స్నానం చేస్తుండగా ఓ మొసలి  దాడి చేసింది. ఆ ప్రమాదంలో మోదీ కాలికి గాయం కాగా.. తొమ్మిది కుట్లు కూడా పడ్డాయి’  అన్నది ఆ కథ సారాంశం. 

ప్రారంభోత్సవానికి వచ్చి, స్వయంగా చెత్త ఎత్తిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్

ఇదిలా ఉండగా, అగ్నిపథ్ పై దేశవ్యాప్త నిరసనల మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ‘మంచి ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన అనేక మంచి విషయాలు రాజకీయాల్లో చిక్కుకోవడం దేశ "దురదృష్టం"’ అని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా ప్రత్యక్షంగా అగ్నిపథ్ నిరసనల గురించి అనేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించలేదు. అయితే,  రాజకీయ పార్టీలు అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో దీనికోసమే ఈ వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు చెలరేగాయి. 

సోమవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లోని ప్రధాన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తూర్పు, పశ్చిమ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో మెట్రో ట్రాక్‌లను రెట్టింపు చేయడం, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి తన ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇతర ప్రాజెక్టులలో ఢిల్లీ-మీరట్ హైవే వంటి అనేక కార్యక్రమాలను మోదీ ఉదహరించారు. 

‘సదుద్దేశంతో తీసుకొచ్చిన ఎన్నో మంచి విషయాలు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దౌర్భాగ్యం.. మీడియా కూడా టీఆర్‌పీ కోసం ఈ రాజకీయాల్లోకి లాగబడుతోంది’ అన్నారు. ఇక సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌, కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణంపై మాట్లాడుతూ వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో భారత రాజధాని గురించి మాట్లాడుకుంటామని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుందని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu