త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

By Nagaraju penumalaFirst Published Aug 15, 2019, 7:38 AM IST
Highlights

ఎర్రకోటలో త్రివిధ దళాల గౌరవ వందనం అనంతరం ప్రధాని మోదీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం అదేవేదికపై నుంచి భారతదేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ఎర్రకోటపై మోదీ ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. 
 

న్యూఢిల్లీ: భారతదేశం 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో మువ్వన్నెల జెండాను ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఎర్రకోటలో త్రివిధ దళాల గౌరవ వందనం అనంతరం ప్రధాని మోదీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. 

అనంతరం అదేవేదికపై నుంచి భారతదేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ఎర్రకోటపై మోదీ ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మగాంధీ సమాధికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. 

అనంతరం అక్కడ నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. ఎర్రకోటలో అశేష జనవాహిని, కట్టుదిట్టమైన భద్రతల నడుమ మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతనం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.   

 ఈ వార్తలు కూడా చదవండి

రాజ్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళి

రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో పంద్రాగష్టు వేడుకలు

click me!