ఉత్తరాదిన భారీ వర్షాలు: హిమాచల్, ఉత్తరాఖండ్ సీఎంలకు మోడీ ఫోన్

Published : Jul 10, 2023, 06:59 PM IST
ఉత్తరాదిన భారీ వర్షాలు: హిమాచల్, ఉత్తరాఖండ్ సీఎంలకు మోడీ ఫోన్

సారాంశం

ఉత్తరాదిన  కురుస్తున్నభారీ వర్షాలతో జన జీవనం అతలాకుతలమౌతుంది. హిమాచల్ ప్రదేశ్,  ఉత్తరాఖండ్ సీఎంలతో  ప్రధాని మోడీ  ఇవాళ మాట్లాడారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ సీఎంలతో  సోమవారంనాడు  ఫోన్ లో మాట్లాడారు.  ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్,  హిమాచల్ ప్రదేశ్ లలో  భారీ వర్షాల కారణంగా  ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

రహదారులు తెగిపోయాయి.  ఆయా ప్రాంతాల్లో  నీటిలోనే  గ్రామాలున్నాయి.  భారీ వర్షాలకు   పెద్ద పెద్ద భవనాలు కూడ  పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో  పరిస్థితులపై సీఎంలను  అడిగి తెలుసుకున్నారు. వర్ష బాధిత  రాష్ట్రాలకు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని  మోడీ  హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో నిరంతరంగా  వర్షాలు కురుస్తున్న కారణంగా కొండ చరియలు  విరిగిపడడంతో పాటు  రోడ్డు దెబ్బతిన్నాయని  హిమాచల్ ప్రదేశ్ సీఎం   ప్రధానికి చెప్పారు.  భారీ వర్షాలకు  17 మంది  మృతి చెందారు.   భారీ వర్షాలకు  కోట్లాది రూపాయాల విలువైన  ఆస్తులు నీటి పాలయ్యాయి.  భారీ వర్షాలతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం  ప్రధానిని కోరారు. 

ఇవాళ  కూడ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,  హర్యానా,  ఢిల్లీలో  భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే  అవకాశ ఉన్నందున  ఉత్తర భారతదేశంలో  తీవ్ర వర్షపాతం  నమోదయ్యే అవకాశం ఉందని  ఐఎండీ వార్నింగ్  ఇచ్చింది. గత రెండు  రోజులుగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  యుమునా నది నీటి మట్టం క్రమంగా  పెరుగుతుంది

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu