అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట: మోడీ పాటిస్తున్న కఠిన నియమాలు...

By narsimha lode  |  First Published Jan 19, 2024, 1:13 PM IST


అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.  ప్రధాన మంత్రి కూడ  ఇందు కోసం  11 రోజులు నిష్టతో  క్రతువును చేపట్టిన విషయం తెలిసిందే.


న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  11 రోజుల అనుష్టనాన్ని  చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ మేరకు  పవిత్ర గ్రంధాలచే సూచించిన బహుళ పద్దతులను మోడీ అనుసరిస్తున్నారు. 
కొబ్బరి నీళ్లను మాత్రమే ప్రధాన మంత్రి తాగుతున్నారు. నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారు. ప్రతి రోజూ గోపూజ చేయడం, గోవులకు ఆహారం ఇస్తున్నారు.  ప్రతిరోజూ అన్నదానం, వస్త్ర దానం చేస్తున్నారు. 

రాముడి భక్తుడిగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని  పలు ప్రాంతాల్లోని  దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.  నాసిక్ నలో కాలారామ్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లేపాక్షి వీరభధ్రస్వామి ఆలయం, కేరళలోని గురువాయుర్ శ్రీకృష్ణఆలయంలో పూజలు నిర్వహించారు. కేరళలోని త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో కూడ పూజలు చేశారు.తమిళనాడులోని  పలు ఆలయాల్లో మోడీ పూజలు చేయనున్నారు. 

Latest Videos

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.  అంతేకాదు పలు భాషల్లో  రామాయణం వింటున్నారు. దేవాలయాల్లో భజనల్లో పాల్గొంటున్నారు. భారతీయ సామాజిక సాంస్కృతిని బలోపేతం చేయడాన్ని  ప్రధాన మంత్రి మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

దేవాలయాల్లో స్వచ్ఛతను  ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. దేశంలోని ఆలయాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ  పాటుపడాలని ఆయన కోరారు.  నాసిక్ లోని రామాలయంలో స్వచ్ఛత కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.  ఈ నెల  12న నాసిక్ లో ని కాలారామ్ శ్రీరాముడి ఆలయంలో  స్వచ్ఛత కార్యక్రమాన్ని మోడీ స్వయంగా శుభ్రపర్చారు.ఆలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.   ప్రధాన మంత్రి  స్వచ్ఛత కార్యక్రమం పిలుపునకు  పెద్ద ఎత్తున స్పందన వచ్చింది సోషల్ మీడియా ఎకస్ లో  ఇది ట్రెండింగ్ గా నిలిచింది. 

click me!