అగ్నివీరుల‌తో ముచ్చ‌టించిన ప్ర‌ధాని మోడీ, రక్ష‌ణ‌మంత్రి రాజ్ నాథ్ సింగ్..

By Mahesh RajamoniFirst Published Jan 16, 2023, 12:58 PM IST
Highlights

New Delhi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా అగ్నివీరులతో మాట్లాడారు. సమావేశంలో  కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాలుపంచుకున్నారు. కాగా, ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 

PM Modi Virtually Interacts With Agniveers: సాయుధ దళాలలో స్వల్పకాలిక చేరిక కార్యక్రమం (అగ్నిప‌థ్ స్కీమ్) కింద నియామకాల ప్రారంభ బృందాల్లో ఒకరైన అగ్నివీరులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముచ్చ‌టించారు. వ‌ర్చువ‌ల్ గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ అగ్నివీరుల‌తో  మాట్లాడార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ, అగ్నివీరుల‌తో పాటు కేంద్ర రక్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

 

Prime Minister interacts with virtually pic.twitter.com/2n7DLeXGdU

— PIB India (@PIB_India)

అగ్నివీరుల తొలి బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. భారత సాయుధ దళాలకు స్వల్పకాలిక ఇండక్షన్ ప్రోగ్రామ్ కింద నియామకాల ప్రారంభ బృందాల్లో ఈ యువకులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.

 

అగ్నిప‌థ్ స్కీమ్ పై వివాదం.. 

తాత్కాలికంగా సాయుధ బ‌ల‌గాల్లో నియామ‌కాలు చేప‌ట్ట‌డం ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీయ‌డమేన‌ని అభిప్ర‌యాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌తిప‌క్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. నాలుగేళ్ల త‌ర్వాత వారి ప‌రిస్థితి ఏంట‌ని మండిప‌డ్డాయి. అలాగే, వ‌య‌స్సు విష‌యంలో కూడా అగ్నిప‌థ్ స్కీమ్ పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్ర‌క‌టించిన త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిర‌స‌న‌ల త‌ర్వాత ప్ర‌భుత్వం మ‌రోసారి నిబంధ‌నల్లో మార్పులు తీసుకువ‌చ్చింది.

ఆ తర్వాత 2022లో ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు ప్రభుత్వం పొడిగించింది. విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, ఈ అగ్నిప‌థ్ స్కీమ్ భారత సాయుధ దళాలను మరింత యవ్వనంగా మారుస్తుందనీ, ప్రస్తుత అవసరాలను తీరుస్తుందని కేంద్రం పేర్కొంది. అలాగే, అగ్నిపథ్ పథకాన్ని 'గేమ్ ఛేంజింగ్'గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల అభివర్ణించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు యువ, హైటెక్, యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యంతో భారత సాయుధ దళాలను ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా మార్చడంలో ఇది ఒక శక్తి గుణకంగా పనిచేస్తుందని తెలిపారు. 

 

click me!