ఇక దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే డ్రెస్ కోడ్ ? ‘‘ వన్ నేషన్, వన్ యూనిఫాం’’ ఆలోచనను వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

By team teluguFirst Published Oct 28, 2022, 4:55 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది తన ఆలోచన మాత్రమే అని, రాష్ట్రాలపై దీనిని బలవంతంగా రుద్దబోనని తెలిపారు. 

ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉండనుందా ? ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పోలీసులకు భిన్నరకాల యూనిఫాంలు ఉన్నాయి. అయితే ఇది మరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో నిర్వహిస్తున్న ‘‘చింతన్ శివిర్’’కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశారు.

ఎన్నిక‌ల ముందు గుజరాత్ బీజేపీ మ‌రోషాక్.. పార్టీని వీడిన మాజీ సీఎం కొడుకు

దేశంలోని పోలీసులందరికీ ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుందని ఆయన అన్నారు. ఆయన ‘‘ఒక దేశం, ఒకే యూనిఫాం’’అనే  ఆలోచనను ప్రతిపాదించారు. ఇది కేవలం పరిశీలన కోసం మాత్రమే అని, రాష్ట్రాలపై దీనిని రుద్దడానికి  ప్రయత్నించడం లేదని అన్నారు. ఇలా చేస్తే  దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాల గుర్తింపు ఒకేలా ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ పోలీసులకు వన్ నేషన్, వన్ యూనిఫాం అనేది కేవలం ఒక ఆలోచన. నేను దానిని మీపై రుద్దడానికి ప్రయత్నించడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇది 5, 50, లేదా 100 సంవత్సరాలలో జరగవచ్చు.’’ అని మోడీ అన్నారు.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత చట్టాలను సమీక్షించి నేటికి అనుగుణంగా వాటిని మార్చాలని సూచించారు. శాంతి భద్రతల సవాళ్లను పరిష్కరించడానికి అన్ని ఏజెన్సీల మధ్య సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాని కోరారు. పోలీసుల పట్ల మంచి అవగాహనను కొనసాగించడం చాలా ముఖ్యమైనదని, ఈ మార్గంలో ఉన్న లొసుగులను తొలగించాలని అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పటికీ, అది దేశ ఐక్యత, సమగ్రతతో సమానంగా ముడిపడి ఉందని తెలిపారు. 

నిషేధిత పీఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి సీఏ రూఫ్‌ అరెస్టు.. పాలక్కాడ్‌లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

ప్రతి రాష్ట్రం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొకటి స్ఫూర్తిని పొందాలని అలాగే అంతర్గత భద్రత కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్గత భద్రతతో పాటు దేశం పట్ల బాధ్యతగా రాష్ట్రాలు కలిసి పనిచేయడం రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని చెప్పారు. కేంద్రంలో లేదా రాష్ట్రాల్లోని అన్ని ఏజెన్సీలు ఒకదానికొకటి సహకరించుకోవాలని సూచించారు. దీని వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని, సాధారణ ప్రజలకు భద్రత లభిస్తుందని తెలిపారు. 

ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. యువతను తీవ్రవాదం వైపు నెట్టడానికి, రాబోయే తరాల మనస్సులను వక్రీకరించడానికి తమ మేధో రంగాన్ని పెంచుతున్న శక్తులపై హెచ్చరించారు. దేశంలోని యువతను తప్పుదోవ పట్టించకుండా నిరోధించేందుకు నక్సలిజం ప్రతి రూపాన్ని తుపాకీలతోనైనా, పెన్నులతోనైనా పెకిలించి వేయాలని అన్నారు.  దేశం ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తితో మన దేశంలో అలాంటి శక్తులను విజృంభించడానికి తాము అనుమతించలేమని అన్నారు. అలాంటి శక్తులకు అంతర్జాతీయంగా గణనీయమైన సహాయం లభిస్తోందని చెప్పారు.

బైకర్‌తో కారు డ్రైవర్‌కు గొడవ.. ముగ్గురుపై నుంచి కారును తీసుకెళ్లిన వైనం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డు (వీడియో)

శాంతిభద్రతలకు అభివృద్ధితో సంబంధం ఉంటుందని ప్రధాని అన్నారు. అందువల్ల శాంతిభద్రతలను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. దేశ బలం పెరిగినప్పుడే ప్రతీ పౌరుడిలో, ప్రతీ కుటుంబంలో శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. మొత్తం శాంతిభద్రతల వ్యవస్థ విశ్వసనీయంగా ఉండటం చాలా ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. దీని కోసం సామాన్య ప్రజలతో పోలీసులకు సంబంధాలు, కమ్యూనికేషన్ మెరుగ్గా ఉండాలని తెలిపారు. దీని వల్ల పోలీసులపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడుతుందని మోదీ అన్నారు.

click me!