నిషేధిత పీఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి సీఏ రూఫ్‌ అరెస్టు.. పాలక్కాడ్‌లో అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ

By team teluguFirst Published Oct 28, 2022, 3:54 PM IST
Highlights

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాజీ సెక్రటరీ సీఏ రవూఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుంది. పీఎప్ఐపై నిషేధం విధించిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. 

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) మాజీ సెక్రటరీ సీఏ రవూఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.  గురువారం అర్ధరాత్రి పాలక్కాడ్‌లోని పట్టాంబిలోని ఇంటి నుంచి ఆయనను అదుపులోకి తీసుకుంది. అరెస్టును నమోదు చేసిన అనంతరం ఎన్‌ఐఏ రవూఫ్‌ను విచారణ నిమిత్తం కొచ్చికి తీసుకెళ్లింది.

బైకర్‌తో కారు డ్రైవర్‌కు గొడవ.. ముగ్గురుపై నుంచి కారును తీసుకెళ్లిన వైనం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డు (వీడియో)

అర్ధరాత్రి సమయంలో పట్టాంబి చేరుకున్న ఎన్‌ఐఏ సిబ్బంది కరీంపుల్లిలోని రవూఫ్ ఇంటిని చుట్టుముట్టారు. రవూఫ్ కోసం కేరళ పోలీసులు, ఎన్ఐఏ కొంతకాలంగా వెతుకుతున్నారు. నిషేధానికి వ్యతిరేకంగా పీఎఫ్‌ఐ హర్తాళ్‌కు పిలుపునివ్వడంతో రవూఫ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. గతంలో ఆయన ఇంటిపైనా, పీఎఫ్‌ఐ కార్యాలయాలపైనా పోలీసులు దాడులు చేసినా ఆచూకీ లభించలేదు.

స్వాతంత్య్రానంతరం భారత్ లో అతిపెద్ద సంస్కరణ ఎన్ఈపీ - 2022 : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

అయితే ఆయన వెళ్ళేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలు,  కలిసే వ్యక్తులపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. రవూఫ్ బంధువులపైనా నిఘా పెట్టారు. ఆ తర్వాత గురువారం ఆయన తన ఇంట్లో ఉన్నట్లు ఎన్‌ఐఏకు పక్కా సమాచారం అందింది. పీఎఫ్‌ఐపై నిషేధం తర్వాత అరెస్టు నుండి తప్పించుకోవడానికి రవూఫ్ కు నాయకులకు సహాయం చేసినట్లు ఎన్‌ఐఎ విశ్వసిస్తోంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత కూడా పీఎఫ్‌ఐ సంస్థాగత కార్యకలాపాలను నియంత్రించేవాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనంలో నివేదించింది. అలాగే ఆయన విదేశాల నుండి వచ్చిన నిధులను వివిధ శాఖలకు పంపించేవారని, తన క్యాడర్‌లకు చట్టపరమైన సహాయాన్ని కూడా అందించేవారని పేర్కొంది. 

Kerala | NIA (National Investigation Agency) arrested former state secretary of PFI CA Raoof last night from his house in Palakkad district. He was absconding after the Government of India banned PFI. pic.twitter.com/gEZmoPaat6

— ANI (@ANI)

పీఎఫ్ఐ పిలుపునిచ్చిన హర్తాళ్‌కు సంబంధించి విస్తృతమైన హింస, పాలక్‌లో ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యల తరువాత.. రవూఫ్ లా  ఎన్‌ఫోర్స్‌మెంట్ నిఘా కింద ఉన్నారు. కానీ ఆయన వాటి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. తన రహస్య ప్రదేశం నుంచి ఆపరేషన్లు నిర్వహించేవారు.

మైక్ వదలి రాని హర్యానా హోంమంత్రి.. వేదికపైనే అమిత్ షా సీరియస్, నాలుగు సార్లు చెప్పినా

కాగా.. కేంద్రం ఇటీవల ఐదేళ్లపాటు పీఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ సంస్థపై ఎన్ఐఏ చర్యలు కొనసాగిస్తోంది. సెప్టెంబరులో ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర ఏజెన్సీలు అలాగే పోలీసు బలగాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక దాడులలో 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

click me!