పూజారుల ఘాతుకం: బాలికపై గుడిలో అత్యాచారం

Published : Oct 04, 2018, 08:19 AM IST
పూజారుల ఘాతుకం: బాలికపై గుడిలో అత్యాచారం

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పూజారులు ఐదేళ్ల బాలికపై ఆలయంలోనే అత్యాచారం చేశారు. స్వీట్లు ఇస్తామని బుజ్జగించి బాలికపై వారు మంగళవారంనాడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పూజారులు ఐదేళ్ల బాలికపై ఆలయంలోనే అత్యాచారం చేశారు. స్వీట్లు ఇస్తామని బుజ్జగించి బాలికపై వారు మంగళవారంనాడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

బాలిక ఓ రైతు కూతురు. అత్యాచారం చేసిన తర్వాత బాలికను ఆమె ఇంటి వద్ద దింపి, విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మలమూత్ర విసర్జన సందర్భంగా బాలికకు నొప్పి రావడాన్ని తల్లి గుర్తించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

బాధితురాలు తొలుత విషయం చెప్పడానికి నిరాకరించింది. తర్వాత విషయమంతా చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు. 

పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పూజారుల్లో ఒకతను 55 ఏళ్ల రాజు పండిత్ కాగా, రెండో అతను 45 ఏళ్ల బాటోలి ప్రజాపతి. ఈ పూజారులు ఇతర బాలికలపై కూడా అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే