ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనదే.. జీ20 సమ్మిట్ లో మోడీ...

Published : Oct 13, 2021, 08:31 AM IST
ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనదే.. జీ20 సమ్మిట్ లో మోడీ...

సారాంశం

Afghanistanలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593 ఆధారంగా ఏకీకృత అంతర్జాతీయ స్పందన అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 

న్యూఢిల్లీ : ఆఫ్ఘన్ భూభాగం రాడికలైజేషన్, తీవ్రవాదానికి మూలంగా మారకుండా చూసుకోవాలని, ఆ దేశంలో కావలసిన మార్పును తీసుకురావడానికి  ప్రపంచవ్యాప్త ఐక్య ప్రతిస్పందన కోసం పిలుపునివ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌పై విర్చువల్ గా జరిగిన G20 Extraordinary Summitలో pm modi ప్రసంగించారు. దీంట్లో భాగంగా ప్రధాని మోడీ ఆఫ్ఘన్ పౌరులకు "అత్యవసర, అవరోధం లేని" మానవతా సహాయం కోసం ప్రపంచదేశాలను ఒత్తిడి చేశారు. అంతేకాదు ఆ దేశంలో పరిపాలనను అందరినీ కలుపుకుని చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

Afghanistanలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593 ఆధారంగా ఏకీకృత అంతర్జాతీయ స్పందన అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. "ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన జి 20 సమ్మిట్‌లో పాల్గొన్నాను. ఆఫ్ఘన్ భూభాగం radicalisation and terrorismకి మూలంగా మారకుండా నిరోధించడంపై ఒత్తిడి చేశాను" అని పిఎం మోడీ ట్వీట్ చేశారు.

"ఆఫ్ఘన్ పౌరులకు అత్యవసర, అవరోధం లేని మానవతా సహాయం కావాలని. వారిని కలుపుకొని పరిపాలన చేయాలని కూడా పిలుపునిచ్చారు" అని ఆయన చెప్పారు. UNSC resolution, ఆగస్టు 30 న భారతదేశం అధ్యక్షతన నడవాలని ప్రపంచ సంస్థ ఆమోదించబడింది. ఆఫ్ఘనిస్తాన్‌లో human rightsలను కాపాడవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడింది. ఆఫ్ఘన్ భూభాగాన్ని తీవ్రవాదానికి ఉపయోగించరాదని, సంక్షోభానికి చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేసింది. 

ప్రతి భారతీయుడు ఆకలి, పోషకాహారలోపాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్ ప్రజల బాధను అనుభవిస్తున్నాడని, వారికి అంతర్జాతీయ సమాజం తక్షణం, మానవతా సహాయం పొందడానికి గల ఆవశ్యకతను ప్రధాని మోదీ నొక్కిచెప్పినట్లు  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఆఫ్ఘన్ భూభాగం ప్రాంతీయంగా లేదా ప్రపంచవ్యాప్తంగా రాడికలైజేషన్, తీవ్రవాదానికి మూలంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని నొక్కిచెప్పారు" అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాంతంలో రాడికలైజేషన్, ఉగ్రవాదం మరియు మాదకద్రవ్యాలు,ఆయుధాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని పెంచాలని పిఎం మోడీ పిలుపునిచ్చారని MEA తెలిపింది. 

"గత 20 సంవత్సరాల సామాజిక-ఆర్ధిక లాభాలను కాపాడటానికి, రాడికల్ భావజాల వ్యాప్తిని పరిమితం చేయడానికి, మహిళలు, మైనార్టీలతో సహా ఆఫ్ఘనిస్తాన్‌లో సమ్మిళిత పరిపాలన కోసం ప్రధానమంత్రి పిలుపునిచ్చారు."
"ఆఫ్ఘనిస్తాన్‌లో ఐక్యరాజ్యసమితి, ముఖ్యమైన పాత్రకు మద్దతునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌పై యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ 2593లో ఉన్న సందేశానికి జి 20 యొక్క పునరుద్ధరణ మద్దతు కోసం పిలుపునిచ్చారు" అని ఇది తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిలో కావలసిన మార్పును తీసుకురావడం కష్టం అయితే ఏకీకృత అంతర్జాతీయ ప్రతిస్పందనను రూపొందించాలని ప్రధాని మోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

మా జోలికి వస్తే ఎవరికీ మంచిది కాదు.. అమెరికాకు ముఖంపైనే చెప్పేసిన తాలిబాన్లు

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పాటు చేసిన తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించవద్దని తాలిబాన్లు హెచ్చరించారు. అలా చేస్తే ఎవరికీ అంత మంచిది కాదని americaకు ముఖంపైనే చెప్పేశారు. talibanలు ఈ ఏడాదిలో మరోసారి afghanistan ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 20ఏళ్ల తర్వాత అమెరికా సేనలు వెనుదిరగడం, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ సైన్యం బలహీనంగా ఉండటంతో తాలిబాన్లు సులువుగా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తొలిసారిగా అమెరికాతో ముఖాముఖిగా సమావేశమయ్యారు. దోహాలో తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖి అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో దోహాలో భేటీ అయ్యారు.

‘ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేయవద్దని మేం వారికి స్పష్టంగా చెప్పాం. అలా చేయడం ఎవరికీ మంచిది కాదన్నాం. ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలు అందరికీ మంచిది. అంతేకానీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తే ప్రజలందరికీ సమస్యలు తప్పవు’ అని ఆమిర్ ఖాన్ ముత్తఖి హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్