వన్ సైడ్ లవ్: కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుండగా బాలికపై దాడి, దారుణ హత్య

Published : Oct 13, 2021, 08:19 AM ISTUpdated : Oct 13, 2021, 08:23 AM IST
వన్ సైడ్ లవ్: కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుండగా బాలికపై దాడి, దారుణ హత్య

సారాంశం

కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి బాలికను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పూణే: మహారాష్ట్రలోని Puneలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ బాలికను యువకుడు దారుణంగా హత్య చేశాడు. వన్ సైడ్ లవ్ ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. హంతకుల్లో ఒకతను బాలికకు బంధువు అవుతాడు.

బీబేవాడి ప్రాంతంలోని యాష్ లాన్స్ లో Kabaddi ప్రాక్టీస్ చేయడానికి బాలిక సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో వెళ్లింది. ఆ మసయంలో మోటార్ సైకిల్ మీద ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారిలో 22 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. బాలికపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. బాలికపై పదే పదే పొడిచారు. 

Also Read:పాముతో కరిపించి భార్య హత్య. ధోషిగా తేలిన భర్త..!

బాలిక అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. బాలికపై దాడి చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు. బాలిక కబడ్డీ ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమవుతుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చారని, ఆమె పక్కకు తీసుకుని వెళ్లారని, వారి మద్య వాగ్వివాదం చోటు చేసుకుందని, ఈ సమయంలో బాలికను కత్తితో పొడిచారని బాలిక బంధువు ఒకరు చెప్పారు. 

దాడి అత్యంత దారుణంగా జరిగినట్లు, దానితో బాలిక అక్కడికక్కడే మరణించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: తల్లితో.. కొడుకుతో ఒకే యువకుడు అక్రమసంబంధం.. నిలదీసిన తండ్రిని... ప్రియుడితో కలిసి గొంతునులిమి హత్య..(వీడియో)

ఈ సంఘటన పూణేలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఏకపక్ష ప్రేమ వ్యవహారమే ఈ Murderకు దారి తీసినట్లు భావిస్తున్నారు. దూరపు బంధువు ఒకరు బాలికను ప్రేమించాడని, ఆమె నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport