నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆ అంశాలపై చర్చకు పట్టుబట్టనున్న విపక్షాలు..!

Published : Jul 18, 2022, 09:43 AM ISTUpdated : Jul 18, 2022, 09:49 AM IST
నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆ అంశాలపై చర్చకు పట్టుబట్టనున్న విపక్షాలు..!

సారాంశం

పార్లమెంట్ వర్షకాలు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సాగనున్నాయి. 

పార్లమెంట్ వర్షకాలు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు సాగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో అగ్నిపథ్ పథకం, ధరల పెరుగుదల, ‘‘అన్‌పార్లమెంటరీ’’ పదాల జాబితా.. వంటి అంశాలతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. మరోవైపు విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సిద్దమైంది. ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. రెండు సభల్లో ప్రెజెంటేషన్ కోసం వివిధ శాఖలు 32 బిల్లులను సూచించాయని.. వాటిలో 14 సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ రోజు లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మరోవైపు అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ రాజ్యసభలో జీరో అవర్ నోటీసు ఇచ్చారు. కేజ్రీవాల్‌ను సింగపూర్‌కు వెళ్లేందుకు కేంద్రం అనుమతించకపోవడంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో రూల్ 267 కింద సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసు  ఇచ్చారు. ఇక, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం రాజ్యసభలో రూల్ 267 కింద కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు. దానిపై చర్చకు డిమాండ్ చేశారు.
 

పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ పార్లమెంటు సమావేశాల్లో 32 బిల్లులు సమర్పించడానికి వివిధ శాఖలు సూచించాయి. వాటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నాయి, అయితే మేము చర్చ లేకుండా బిల్లులను ఆమోదించం’’ అని చెప్పారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాల డిమాండ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘పార్లమెంటు నియమాలు, విధానాల ప్రకారం అన్ని అంశాలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని ప్రహ్లాద్ జోషి తెలిపారు. 

‘‘ధరల పెరుగుదల, అగ్నిపథ్ స్కీమ్, దేశ సమాఖ్య నిర్మాణంపై దాడి, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి 13 అంశాలను అఖిలపక్ష సమావేశంలో మేం లేవనెత్తాం’’ అని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. 14 రోజుల్లో 32 బిల్లులు ఎలా ఆమోదం పొందుతాయని ప్రశ్నించారు.

ఇక, ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చించేందుకు పలు విపక్ష పార్టీల నేతలు ఆదివారం ఢిల్లీలోని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో వేర్వేరుగా సమావేశమయ్యారు. అగ్నిపథ్ స్కీమ్, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం, రైతుల సమస్యలు, ఎంఎస్‌పీ, అన్‌పార్లమెంటరీ పదాల జాబితా, నిరుద్యోగం వంటి అంశాలపై  చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?