
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో (ramnath kovind) సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) . పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయన ఆరా తీశారు. నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోడీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రతను కల్పించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలావుంటే భద్రతా లోపాల కారణంగా ప్రధాని మోదీ కాన్వాయ్ అరగంటల పాటు ఫ్లై ఓవర్‌పై చిక్కుకుపోయిందని.. ఇందుకు సంబంధించి విచారణ ప్రారంభించాలని కోరుతూ లాయర్ వాయిస్ (Lawyers Voice) అనే సంస్థ పిల్ దాఖలు చేసింది. ప్రధానమంత్రి పర్యటన కోసం పంజాబ్ పోలీసుల బందోబస్త్‌కు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని బఠిండా జిల్లా జడ్జిని ఆదేశించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడా ధర్మసనాన్ని పిల్ దాఖలు చేసిన సంస్థ తరఫున సీనియర్ లాయర్ Maninder Singh అభ్యర్థించారు.
ప్రధాన మంత్రి కాన్వాయ్ రోడ్డుపై చిక్కుపోయిన ఘటన.. పంజాబ్ ప్రభుత్వం తరఫున తీవ్రమైన లోపమని, ఈ భద్రతా ఉల్లంఘన ఆమోదయోగ్యం కానివని మణిందర్ సింగ్ అన్నారు. పంజాబ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సమగ్రమైన దర్యాప్తు జరపాలని కోరారు. ఈ క్రమంలోనే.. ‘మీరు కోర్టు నుంచి ఏమి ఆశిస్తున్నారు?.. ఆరోపించిన భద్రతా లోపం బఠిండాలో జరిగిందా లేదా ఫిరోజ్‌పూర్‌లో జరిగిందా’ అని CJI NV Ramana నేతృత్వంలోని ధర్మాసం మణిందర్ సింగ్‌ను ప్రశ్నించింది. ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్‌లో ప్రసంగించాల్సి ఉందని.. అయితే బఠిండాలో భద్రతా లోపం జరిగిందని మణిందర్ సింగ్ ధర్మాసనానికి తెలిపారు.
Also Read:గతంలో ప్రధానికి భద్రతా లోపాలు ఏర్పడ్డ సందర్భాలు ఇవే..!
మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో హై లెవెల్ కమిటీని ఏర్పాటుచేసింది పంజాబ్ ప్రభుత్వం (punjab govt) మూడ్రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ (charanjit singh channi) . ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్ అఫైర్స్) & జస్టిస్ అనురాగ్ వర్మ ఉన్నారు. ఇప్పటికే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) తీవ్రంగా పరిగణిస్తున్నారు. భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులను ఆదేశించారు. భటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక హెలికాఫ్టర్ ద్వారా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించలేదనీ.. దీంతో ప్రధాని రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించారనీ అమిత్ షా తెలిపారు.
భద్రతకు సంబంధించి పంజాబ్ రాష్ట్ర డీజీపీ నుంచి అనుమతులు వచ్చాకే.. రోడ్డు మార్గంలో ప్రధాని కాన్వాయ్ ప్రారంభమైందని అమిత్ షా చెప్పారు. అధికారులు అనుమతి ఇచ్చిన తర్వాత నిరసనకారులకు ప్రధాని రూట్ మ్యాప్ ఎలా తెలిసిందన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. ప్రధాని రూట్ మ్యాప్‌ను ఎవరు లీక్ చేశారన్న దానిపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేస్తున్నాయి.