ఎర్రకోట సాక్షిగా త్రివర్ణ పతాకానికి అవమానం..: బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి సీరియస్

By Arun Kumar PFirst Published Jan 29, 2021, 11:48 AM IST
Highlights

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా మొదటిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ లో ప్రసంగించారు. 

న్యూడిల్లి: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని న్యూడిల్లిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. యావత్ దేశం గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో దేశ రాజధానిలో ఈ ఘటనలు జరగడం దురద్రుష్టకరం అన్నారు. ఈ చర్యలతో నిరసనకారులు రిపబ్లిక్ డేను అవమానించారన్నారు. అలాగే ఎర్రకోటపై జాతీయ జెండాను తొలగించడం ద్వారా త్రివర్ణ పతకాన్ని అవమానించారని రాష్ట్రపతి అన్నారు. 

ఇవాళ(శుక్రవారం బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రసంగానికి ఇప్పటికే 18 పార్టీలు బహిష్కరించాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార టీఆర్ఎస్, వైసిపి లతో పాటు టిడిపి ఎంపీలు పార్లమెంట్ కు హాజరయ్యారు. తొలి విడతలో 15 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు సాగనున్నాయి. 

బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ...  ప్రతి ఒక్కరూ చట్టాలను పాటించాలని సూచించారు. శాంతిభద్రతలను ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. గతంలో అన్ని పార్టీలు వ్యవసాయ చట్టాలను స్వాగతించాయని... కానీ ఇప్పుడు వాటిపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కొత్త చట్టాలతోనే రైతులరు అధిక లాభం వుంటుందన్నారు. వ్యవసాయ చట్టాలను రైతులు అర్థం చేసుకోవాలని  సూచించారు.

ఇక కరోనా కారణంగా మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆరుగురు ఎంపీలకు రాష్ట్రపతి నివాళి అర్పించారు. కరోనా సమయంలో జరుగుతున్న ఈ సమావేశం చాలా విశిష్టమైందన్నారు. ప్రస్తుతం భారత్ మరింత సామర్థ్యంలో ప్రపంచం ముందుకు వచ్చిందన్నారు. మన ఐక్యమత్యమే మహా బలం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

''సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుతో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు చేరుకున్న వలస కూలీలు ఆకలితో మాడకుండా చూశాం. గరీబ్ రోజ్ గార్ కల్యాణ్ యోజన్ గ్రామాల్లోకి వచ్చిన వారికి అండగా నిలిచాం. ఇక జన్ ధన్ ఖాతాతో పాటు కేంద్ర పథకాలు నిరుపేద మహిళలకు అండగా నిలిచాయి. ఆత్మనిర్బర్ భారత్ అవసరం ఎంత వుందో కరోనా కష్టకాలంలో అర్థమైంది'' అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

''కరోనా వ్యాక్సిన్, అంతకుముందు కరోనా కిట్స్, వెంటిలేటర్లు తదితర వైద్య పరికరాలను సైతం ఇక్కడే తయారుచేసుకున్నాం. అంతేకాదు అనేక దేశాలకు వైద్యసాయం అందించాం. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అందించడానికి సిద్దంగా వున్నాం.  ప్రపంచానికి కరోనాను అందించిన ఘనత భారత్ కే దక్కుతుంది'' అని స్పష్టం చేసింది.  

''దేశంలో ఆరోగ్య సేవలు నిరుపేదలకు అందుతున్నాయి. ఆయుష్మాన్ యోజన్ ఎంతో ఉపయోగకరంగా వుంది. ఆరేళ్లలో ఆరోగ్యం రంగంలో చేపట్టిన సంస్కరణలు ఈ కరోనా సమయంలో ఉపయోగపడ్డాయి. దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచాం. కోటిన్నర మందికి ఉచిత వైద్యసాయం అందించాం'' అని తెలిపారు. 

''ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. రైతులను అండగా నిలిచి మద్దతు ధరలు అందిస్తోంది. దేశంలో పంటల ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. చిన్న తరహా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుండి సాయం అందిస్తున్నాం. కిసాన్ రైలు చాలా ఉపయోగకరంగా వుంది'' అని పేర్కొన్నారు.

''ఆదర్శ గ్రామాల నిర్మాణం... గ్రామ ప్రజల కోసం కేంద్రం తాపత్రయపడుతోంది. ప్రతి ఒక్కరిని సొంతింటి కల నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాం. అంబేద్కర్ స్పూర్తితో వాటర్ పాలసీ తీసుకువచ్చి  ప్రతి ఒక్కసారి స్వచ్చమైన నీరు అందించే ప్రయత్నం జరుగుతోంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ముద్రా యోజన ద్వారా మహిళలకు ఎంతో లబ్ది చేకూరుతోంది. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నాం'' అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు.
 

click me!