పురుషుల వీర్యంపై కరోనా దెబ్బ..తేల్చిన తాజా పరిశోధన

Published : Jan 29, 2021, 08:23 AM ISTUpdated : Jan 29, 2021, 09:16 AM IST
పురుషుల వీర్యంపై కరోనా దెబ్బ..తేల్చిన తాజా పరిశోధన

సారాంశం

 ఓ సంస్థ చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజంగానే ఈ మహమ్మారి పురుషుల్లో వీర్యం నాణ్యతను తగ్గించేస్తుందని తేలింది. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. కాగా... ఈ మహమ్మారి సోకిన వారికి తర్వాత పిల్లలు పుట్టడం చాలా కష్టమనే ప్రచారం ఆ మధ్యకాలంలో బాగానే సాగింది. ఈ క్రమంలో చాలా మంది యువకులు.. వైరస్ సోకకముందే.. స్పెర్మ్ బ్యాంకులకు పరిగెత్తి.. తమ వీర్యాన్ని దాచుకున్న వారు కూడా ఉన్నారు. అయితే.. ఆ తర్వాత అదంతా ప్రచారమేనని.. ఈ మహమ్మారి వీర్యంపై ఎలాంటి ప్రభావం చూపించదని నిపుణులు చెప్పారు.

అయితే.. తాజాగా.. ఓ సంస్థ చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజంగానే ఈ మహమ్మారి పురుషుల్లో వీర్యం నాణ్యతను తగ్గించేస్తుందని తేలింది. ఇక మహిళల్లో కూడా ఏంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పురుషుల్లో ప్రొడక్టివ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది.

కాగా.. ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మందికి సోకగా... 2.2 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ మహమ్మారి సోకిన చాలా మందిలో.. ఈ ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. 

కరోనా సోకిన పురుషులు... ఈ వైరస్ సోకని పురుషుల పై చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైందని వారు చెబుతున్నారు. వైరస్ సోకిన పురుషుల వీర్యంలో నాణ్యత తగ్గిపోయిందని వారు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?