కోడికూర వండలేదని.. భార్యను కొడవలితో నరికి చంపాడు...

Published : Jun 11, 2022, 08:35 AM IST
కోడికూర వండలేదని.. భార్యను కొడవలితో నరికి చంపాడు...

సారాంశం

కోడికూర వండలేదని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడ్డంగా నరికేశాడో భర్త. ఆ తరువాత తాగిన మత్తు దిగడంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 

కర్ణాటక : కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్న కారణానికే ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యను అతికిరాతకంగా నరికి చంపాడో కసాయి భర్త. కుమార్తె పుట్టినరోజున chicken curry చేయలేదనే ఆగ్రహంతో కొడవలితో wifeను హతమార్చాడు. కర్ణాటకలో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. హతురాలిని షీల(28)గా గుర్తించారు. భార్యను హతమార్చిన భర్తకు Alcohol intoxication దిగిపోవడంతో చేసిన తప్పును గుర్తించి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే Karnatakaలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కోడూరు గ్రామానికి చెందిన కెంచప్ప- షీలా దంపతులు. ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక్క కుమార్తె సంతానం. 

కొంతకాలంగా భార్య ప్రవర్తనపై కెంచప్పకు అనేక సందేహాలు ఉండేవని సమాచారం. ఈ కారణంగానే తరచూ ఇద్దరూ గొడవ పడేవారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదుర్చారు. అయినా భర్త వేధింపులు ఆగకపోవడంతో వాటిని తట్టకోలేకొన్నాళ్లపాటు పుట్టింటికి వెళ్ళింది. బుధవారం రాత్రి కూతురు జన్మదిన వేడుకల సందర్భంగా పుట్టింటి నుంచి భర్త దగ్గరికి వచ్చింది. కుమార్తె పుట్టినరోజున చికెన్ చేయాలంటూ కెంచెప్ప పురమాయించాడు. అయితే ఆమె ఎందుకో ఆ పని చేయలేకపోయింది. ఇంటికి వచ్చిన భర్త.. భార్య చికెన్ వండలేదని తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. 

అప్పటికి మద్యం మత్తులో ఉన్న భర్త షీలాతో గొడవకు దిగాడు. వాగ్వాదంతో దాంతో ఆరంభమైన గొడవ ఘర్షణకు దారితీసింది. చివరికి పట్టరాని కోపంతో అందుబాటులో ఉన్న కొడవలితో ఆమె మీద దాడిచేసి నరికేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఆ తరువాత గురువారమంతా కనిపించకుండా మాయమైన ఆ వ్యక్తి మద్యం మత్తు దిగిపోవడంతో శుక్రవారం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. హరిహర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

చికెన్, మటన్ వండలేదని.. పురుగులమందు తాగి...

ఇదిలా ఉండగా, khammam జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన married womanను వెంబడించి Obscenityగా ప్రవర్తించిన సంఘటనలో ఏడుగురి మీద శుక్రవారం case నమోదయ్యింది. హైదరాబాద్ నుంచి పుట్టింటికి వెళ్లేందుకు భర్త, 14 నెలల కుమారుడితో కలిసి ఆమె ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున బస్సు దిగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సోదరుడితో కలిసి ద్విచక్రవాహనం మీద ఇంటికి వెడుతుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించారు. 

బాధితురాలి మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెను వదిలేసి వెళ్లాలంటూ సోదరుడు, భర్తను బెదిరించారు. వారినుంచి తప్పించుకుని స్వగ్రామానికి వెళ్లిన వెంటనే గ్రామస్తుల సహకారంతో నిందితులను గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నగరంలోని ఎన్నెస్టీ రోడ్డుకు చెందిన ఏడుగురిని (వీరిలో ముగ్గురు మైనర్లు)తో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఈ ఘటన మీద పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆగ్రమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?