భూకంపాలు, ఉగ్రదాడుల రిపోర్టింగ్ పై అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు 

By Rajesh KarampooriFirst Published Nov 29, 2022, 7:12 PM IST
Highlights

ఉగ్రదాడులను ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలని, దాడి చేసేవారికి  ఆధారాలు ఇచ్చే విధంగా కాకుండా.. దాడి చేసిన విధానం గురించి తెలిపేలా ఉండాలని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం సూచించారు.
 

ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీ: భూకంపాలు, అగ్నిప్రమాదాలు , ఉగ్రవాద దాడులపై రిపోర్టింగ్ చేయడంలో మీడియా అప్రమత్తంగా,బాధ్యతాయుతంగా ఉండాలని సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం అన్నారు. ఉగ్రదాడి జరిగినప్పుడు లైవ్ రిపోర్టింగ్ చేయడం వల్ల దాడి చేసిన వారికి క్లూ ఇవ్వకుండా, వారి దుష్ట ఉద్దేశాలను ప్రచారం చేసేలా మీడియా చూసుకోవాలని సూచించారు. 

ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ జనరల్ అసెంబ్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. మీడియాను అభినందిస్తూ.. కోవిడ్ మహమ్మారి సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా మనందరికీ పరీక్షా సమయం అని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో.. ప్రపంచంతో అనుసంధానం చేసింది మీడియేనని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సరైన,సమయానుకూల సమాచారాన్ని అందించడం మీడియా బాధ్యత అని అన్నారు. కోవిడ్ సమయంలో అవగాహన సందేశాలు, ముఖ్యమైన ప్రభుత్వ మార్గదర్శకాలను మీడియా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాడానికి మీడియా చాలా ఉపయోగపడిందని అన్నారు.   
 
భూకంపాలు, అగ్నిప్రమాదాలు,మరీ ముఖ్యంగా ఉగ్రవాద దాడుల వార్తలను రిపోర్టింగ్ చేసే సమయంలో మీడియా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. నిజమైన సమాచారాన్ని అందించడం మీడియా యొక్క ప్రధాన బాధ్యత అనీ, వాటిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచే ముందు వాస్తవాలను సరిగ్గా తనిఖీ చేయాలని అన్నారు. సోషల్ మీడియా వ్యాప్తితో నకిలీ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయని ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు.

సమాచారాన్నివేగంగా ప్రసారం చేయడం కంటే.. అందులో ఖచ్చితత్వం ఉందో లేదో అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని  అన్నారు.ధృవీకరించని వార్తలను ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)"ఫ్యాక్ట్ చెక్ యూనిట్"ని ఏర్పాటు చేసిందని ఠాకూర్ అన్నారు.

బాధ్యతాయుతమైన మీడియా సంస్థలకు ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం అత్యున్నత మార్గదర్శక సూత్రంగా ఉండాలని మంత్రి అన్నారు.  పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌లు "దూరదర్శన్", "ఆల్ ఇండియా రేడియో" ఎల్లప్పుడూ సత్యం కోసం నిలబడ్డాయనీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నందుకు నిరంతరం క్రుషి చేస్తున్నాయని అన్నారు. 

click me!