కోవిడ్ సేవల్లో ఉపవాసంతో నర్సు సేవలు

By narsimha lodeFirst Published Apr 25, 2021, 4:40 PM IST
Highlights

గర్భంతో ఉన్న ఓ నర్సు కరోనా రోగులకు సేవలు చేస్తోంది. ఉపవాసం ఉంటూ మరీ ఆమె రోగులకు  ప్రతి రోజూ వైద్య సహాయం చేస్తోంది. 
 

గాంధీనగర్: గర్భంతో ఉన్న ఓ నర్సు కరోనా రోగులకు సేవలు చేస్తోంది. ఉపవాసం ఉంటూ మరీ ఆమె రోగులకు  ప్రతి రోజూ వైద్య సహాయం చేస్తోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన  నాన్సీ అయేజా మిస్త్రీ అనే మహిళ సూరత్‌లో నర్స్‌గా పనిచేస్తోంది.  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  సూరత్ లోని అల్దాన్ కమ్యూనిటీ హాల్ లో ఆమె కోవిడ్ రోగులకు సేవలు అందిస్తోంది. 

ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆమె ప్రతి రోజూ ఉపవాసం చేస్తోంది. ఉపవాసదీక్షలో ఉంటూనే ఆమె తన విధులకు హాజరౌతోంది. తన కడుపులో తనకు పుట్టబోయే శిశువు ఉన్నాడు. అయితే అంతకంటే  తనకు డ్యూటీ అంతకంటే ముఖ్యమని ఆమె చెప్పారు. దేవుడి ఆశీర్వాదం మేరకు పవిత్రమైన రంజాన్ మాసంలో కరోనా రోగులకు సేవ చేసే అవకాశం దక్కిందని ఆమె మీడియాకు చెప్పారు. 

అందరి ఆశీర్వాదం వల్లే తాను తన బిడ్డ ఆరోగ్యంగా ఉంటామని  ఆమె ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కరోనా అని తెలిస్తే ఆ రోగి వద్దకు వెళ్లేందుకు కుటుంబసబ్యులు కూడ జంకుతారు. కానీ ఇలాంటి సమయంలో గర్భంతో ఉన్న నర్సు కోవిడ్ రోగులకు సేవ చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. 


 

click me!